ఏపీలో కరోనాతో 17 మంది మృతి

by Anukaran |   ( Updated:2020-07-11 07:32:22.0  )
ఏపీలో కరోనాతో 17 మంది మృతి
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 17 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో ఇదే ఇప్పటి వరకు అత్యధిక మరణాలు సంభవించిన రోజు. కర్నూలు జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు చొప్పున 17 మంది మరణించడంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 309 మంది మృత్యువాత పడ్డారు.

గడచిన 24 గంటల్లో 1,813 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో ఏపీకి చెందిన వారు 1775 మంది అయితే, విదేశాలకు చెందిన నలుగురు, ఇతర రాష్టాలకు చెందిన 34 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 27,235 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ రోజు రికార్డు స్థాయిలో అనంతపురం (311), చిత్తూరు (300), కర్నూలు (229), శ్రీకాకుళం జిల్లాలో (204) కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,168 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,393కి పెరిగింది. ఇంకా 12,533 మంది చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed