- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎన్జీఓల ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్ మస్ వేడుకలు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: టీఎన్జీఓల ఆధ్వర్యంలో బుధవారం క్రిస్ మస్ వేడుకలను నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన టీఎన్జీఓ భవన్ లో క్రిష్టమస్ సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తోందన్నారు.
ఈ రోజు టీఎన్జీఓ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నందుకు జిల్లా టీఎన్జీవో అధ్యక్ష కార్యవర్గ బృందాన్ని, జిల్లా యంత్రాంగం పక్షాన అభినందించారు. ప్రజలందరూ ప్రతి పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకొని ఐక్యతను చాటాలని కోరారు. టీఎన్జీఓ అధ్యక్షులు కిషన్ మాట్లాడుతూ.. టీఎన్జీవో సంఘం ఉద్యోగుల పక్షపాత సంఘమని అన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు వివిధ సేవ కార్యక్రమాలను, కులమతాలకు అతీతంగా నిర్వహించి, ప్రజలందరి మధ్య ఐక్యతను చాటుటకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనిట్ శాఖల టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, క్రైస్తవ జిల్లా మతపెద్దలు జాన్సన్, జోసఫ్, ఏఐసీసీ జిల్లా అధ్యక్షులు వయ్యా డేవిడ్, జాన్ సామ్యుల్, జాన్సన్ అబ్రహం వివిధ శాఖల క్రైస్తవ ఉద్యోగులు హాజరయ్యారు.