గెలిపిస్తే.. ప్రజా గొంతుకై నిలదీస్తా

by Sridhar Babu |
గెలిపిస్తే.. ప్రజా గొంతుకై నిలదీస్తా
X

దిశ, భద్రాచలం: వరంగల్- నల్లగొండ – ఖమ్మం శాసనమండలి స్థానానికి జరిగే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజల గొంతుకై శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలంగాణ జనసమితి ఎంఎల్‌సీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివాసీ నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఆహ్వానం మేరకు ఆయన భద్రాచలం వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చిన కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ద్వారా పట్టభద్రులు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడిస్తేనే ప్రభుత్వం తన తప్పిదాలను తెలుసుకొనే అవకాశం ఉందన్నారు. విజ్ఞులైన పట్టభద్రులకు ఇది ముమ్మాటికి సాధ్యమని అన్నారు.

Advertisement

Next Story