శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల పంపిణీ ప్రారంభం

by srinivas |
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల పంపిణీ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్ల పంపిణీ ప్రారంభమైంది. అర్ధరాత్రి 1.30 గంటల నుంచే టోకెన్ల క్యూలైన్‌లోకి భక్తులకు అనుమతించారు. కాగా, టోకెన్ల పంపిణీకి తిరుపతిలో ఐదు చోట్ల 50 కౌంటర్లను ఏర్పాటు చేశారు. కౌంటర్లలో రాత్రి 2.30 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తున్నారు అధికారులు. తిరుపతి స్థానికులకే వైకుంఠ దర్శనం, సర్వదర్శనం టోకెన్లను అందజేస్తున్నారు. నేటి నుంచి జనవరి 3 వరకు లక్ష టోకెన్లను ఇవ్వనున్నారు. టికెట్ల కౌంటర్ల వద్ద రాత్రి నుంచే భక్తులు బారులు తీరారు.

Advertisement

Next Story