మోడ్రన్ యూట్యూబర్స్.. వంటింటి నుంచి సెక్స్ ఎడ్యుకేషన్‌ వరకు..

by Shyam |
మోడ్రన్ యూట్యూబర్స్.. వంటింటి నుంచి సెక్స్ ఎడ్యుకేషన్‌ వరకు..
X

దిశ, ఫీచర్స్ : నేటి ఇంటర్నెట్ కాలంలో సమస్య ఏదైనా సరే.. సమాధానం వెతుక్కోవడం చాలా ఈజీ. ప్రశ్న సంధించడమే ఆలస్యం.. గూగుల్ మనకు కావాల్సిన ఆన్సర్‌ను క్షణాల్లో శోధించేస్తుంది. కానీ అందులో దేన్ని నమ్మాలి? దేన్ని నమ్మొద్దో? తెలుసుకోవడమే కష్టం. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘సెక్స్’ లైఫ్ గురించి. సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలా మంది శృంగార సంబంధ సమస్యలకు సొల్యూషన్ తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయాలను ఎవరితోనైనా షేర్ చేసుకునేందుకు మొహమాటపడుతూ తమ ప్రాబ్లెమ్‌ను మరింత కాంప్లికేట్‌గా మార్చుకుంటారు. కాగా ఇటువంటి సందేహాలపై e-తరం మిలీనియల్స్ ఓపెన్‌గా చర్చిస్తున్నారు. పలువురు మహిళా యూట్యూబర్స్ వీడియో పోస్ట్‌ల ద్వారా యూజర్ల సెక్స్ లైఫ్‌ సందేహాలను తీర్చడంతో పాటు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌ను అందిస్తున్నారు.

హెవెన్లీ హోమ్ మేడ్.. అలేఖ్య

2017లో ‘హెవెన్లీ హోం మేడ్’ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించిన అలేఖ్య.. కేవలం సెక్స్ సంబంధింత అంశాలపై మాత్రమే కాకుండా స్కిన్ కేర్, షాపింగ్, మేకప్, ఫిమేల్ హైజీన్‌పై వీడియోలు చేస్తోంది. ప్రస్తుతం అలేఖ్య చానల్‌కు 2.54 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా.. తను వీడియోల ద్వారా అందించే టిప్స్ ఫాలో అయితే ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చని చెప్తోంది. అంతేకాదు చిన్న చిన్న వస్తువులతో ఇంటిని అందంగా ఎలా మార్చుకోవచ్చు? పట్టు చీరలతో పాటు తక్కువ బడ్జెట్‌కు ఎక్కువ క్వాలిటీ ఉండే కిచెన్ ఐటమ్స్ ఎక్కడ లభిస్తాయి? వంటి విభిన్న అంశాలపై వీడియోలు రూపొందించిన అలేఖ్య, సీజన్‌ను బట్టి ప్రజలకు అవసరమయ్యే వీడియోలు చేస్తూ దూసుకుపోతోంది.

అనిత నెల్లూరు అమ్మాయి..

ఆడపిల్లను లక్ష్మీదేవిగా పూజించడం మన సంస్కృతిలో భాగమని, సందర్భోచితంగా పురాతన సంప్రదాయాల గురించి వివరిస్తున్న యూట్యూబర్ అనిత పత్తిపాటి. 2019లో ‘అనిత నెల్లూరు అమ్మాయి’ పేరుతో ప్రారంభించిన ఈ చానల్‌కు ప్రస్తుతం 3.26 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. కాగా అనిత ఎంచుకున్న ప్రతీ అంశాన్ని చాలా క్లియర్‌గా తన వీడియోల్లో వివరిస్తుంది. జననాంగాల ఆరోగ్యం, డైట్‌ టిప్స్‌తో పాటు సెక్స్ పట్ల నెలకొన్న అపోహల గురించి అర్థమయ్యే రీతిలో చెప్తోంది. కామెంట్ సెక్షన్‌లో యూజర్స్ క్వశ్చన్స్ చదివి, వారితో ఇంటరాక్ట్ అవుతూ అనుమానాలను నివృత్తి చేస్తోంది. అయితే సెక్స్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడేప్పుడు యూట్యూబ్ పాలసీ నిబంధనలకు లోబడే వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో తాను డాక్టర్‌ని కాదని, కానీ డాక్టర్ల వద్ద నుంచి తెలుసుకున్న కొన్ని విషయాలను మాత్రమే వీడియో రూపంలో వివరిస్తున్నానని, తన వీడియోల్లో వివరించే విషయాల్లో తప్పులు కూడా ఉండొచ్చని, క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పడం గమనార్హం.

ఇస్మార్ట్ కవిత..

సృష్టికి మూలమైన మాతృత్వం పొందడం ప్రతీ మహిళ కల. ఒకసారి ప్రెగ్నెన్నీ కన్ఫర్మ్ అయ్యాక నవ మాసాలు మోసి, బిడ్డ పుట్టేంత వరకు గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తన వీడియోల ద్వారా ఇందుకు సంబంధించిన టిప్స్‌ చెప్తూ గర్భిణులకు తనవంతు సాయం చేస్తోంది కవిత. బ్యూటీ, చిల్డ్రన్ హెల్త్ కేర్‌తో పాటు ప్రెగ్నెన్నీ కేర్‌కు సంబంధించిన విషయాలు తెలిపేందుకు ‘ఇస్మార్ట్ కవిత’ యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసిన కవిత.. ప్రెగ్నెన్సీ టైంలో ఉపవాసం ఉండొచ్చా? బిడ్డ పుట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అనే అంశాలపై స్పెషల్ వీడియోలు చేసింది. కవిత కేవలం గర్భం గురించిన వీడియోలు మాత్రమే కాకుండా సబ్‌స్క్రైబర్ల కోరిక మేరకు సెక్స్ లైఫ్‌కు సంంధించిన అనేక అంశాలపై చేసిన వీడియోలను ఎక్కువ మంది వీక్షించారు. ఈ చానల్‌కు ప్రస్తుతం 1.24 లక్షల సబ్‌స్రైబర్లు ఉండటం విశేషం.

మన ఇంటి టిప్స్..

డ్రెస్సింగ్ స్టైల్ ను బట్టి బ్యూటీనెస్ ఇంప్రూవ్ అవుతుందంటోంది యూట్యూబర్ కల్యాణి. ‘మన ఇంటి టిప్స్’ అనే చానల్ ద్వారా సాధారణ విషయాల నుంచి మొదలుకుని ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే ఏం చేయాలి? ప్రెగ్నెన్సీ మిస్ క్యారేజ్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీరియడ్ సైకిల్ ప్రాముఖ్యతో పాటు గర్భం రాకుండా ఉండాలంటే ఏం తీసుకోవాలి? వంటి అంశాలపై వీడియోలు చేసింది. 3.72 లక్షల మంది సబ్ స్క్రైబర్లతో దూసుకుపోతున్న ఈ చానల్‌లో హెల్తీ టిప్స్ కూడా షేర్ చేస్తోంది కల్యాణి. ఇవేగాక ఫిజికల్ అప్పియరెన్స్ కోసం ఏం చేయాలి? ఎలాంటి బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి హార్మోన్లు ఏ విధంగా తోడ్పడతాయి? అనే అంశాలతో పాటు సెక్సువల్ లైఫ్ ఇంపార్టెన్స్‌పై కల్యాణి చేసిన వీడియోలకు మంచి ఆదరణ లభించింది.

Advertisement

Next Story

Most Viewed