సీఎం స్టాలిన్‌నే.. తేల్చేసిన టైమ్స్ నౌ సర్వే

by Shamantha N |
సీఎం స్టాలిన్‌నే.. తేల్చేసిన టైమ్స్ నౌ సర్వే
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో పలు సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికలపై ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాలను టైమ్స్ నౌ ఇవాళ వెల్లడించింది. ఈ సర్వేలో తమిళనాడులో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకేదే అధికారమని తేలింది. డీఎంకే కూటమి 173 స్థానాల్లో గెలుస్తుందని, బీజేపీ కూటమికి 45 నుంచి 53 స్థానాలు వస్తాయని తమ సర్వేలో తెలిపింది.

ఇక కమల్ హాసన్ పార్టీ అయిన ఎంఎన్‌ఎమ్ ఒకటి నుంచి 5 స్థానాలను దక్కించుకునే అవకాశముందని టైమ్స్ నౌ తమ సర్వేలో తెలిపింది. టీటీవీ దినకరన్ పార్టీకి 1-5 స్ధానాలు, ఇతరులు 1-4 స్థానాల్లో గెలిచే అవకాశముందని తెలిపింది.

Advertisement

Next Story