కొత్త టిక్ టాక్ ఫిల్టర్‌లు.. మిస్ అవుతున్న భారతీయులు

by Harish |
కొత్త టిక్ టాక్ ఫిల్టర్‌లు.. మిస్ అవుతున్న భారతీయులు
X

దిశ, వెబ్‌డెస్క్ :టిక్ టాక్ యాప్ మీద భారతదేశంలో నిషేధం విధించినప్పుడు టిక్ టాకర్ల చాలా బాధపడ్డారు. కొన్నిరోజులయ్యాక వేరే పనుల్లో పడి కొత్త దారులు వెతుక్కున్నారు. అయితే వేరే దేశాల్లో టిక్ టాక్ ఇంకా నడుస్తూనే ఉంది కదా! ఇప్పుడేమో ఆయా దేశాల యూజర్ల కోసం టిక్ టాక్ ప్రవేశపెడుతోన్న కొత్త కొత్త ఫిల్టర్లను చూసి భారతీయ టిక్ టాకర్లు ఫీల్ అవుతున్నారు. మన దగ్గర టిక్ టాక్ ఉండుంటే, ఈ కొత్త ఫిల్టర్లతో కొత్త చాలెంజ్‌లతో ఒక ఊపు ఊపే వాళ్లం కదా అని లోలోపల బాధపడుతున్నారు. వాళ్లకి ఇంత బాధను కలిగిస్తున్న ఫిల్టర్ పేరు టైమ్ వార్ప్ ఫిల్టర్.

కెమెరాలో చిత్రాన్ని ప్రతి లైన్‌లో ఫ్రీజ్ చేయడం ద్వారా ఈ టైమ్ వార్ప్ స్కాన్ ఫిల్టర్ పనిచేస్తుంది. నీలి రంగు గీత కదులుతున్నపుడు వివిధ హావభావాలు ముఖంలో చూపించడం ద్వారా టైమ్ వార్ప్ స్కానింగ్ పూర్తయ్యే సరికి నవ్వు తెప్పించే ఇమేజ్ రెడీ అవుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు టిక్ టాక్‌లో విభిన్న చాలెంజ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఈ టైమ్ వార్ప్ ఫిల్టర్ ద్వారా స్మోకింగ్ ఇల్యూజన్, మిర్రర్ డబుల్, టిమ్ బర్టన్ క్యారెక్టర్, థిన్ అండ్ వేవీ ఐబ్రోస్, ఫ్లోటింగ్ ఇల్యూజన్, ఎఫెక్ట్ ఫెయిల్ వంటి చాలెంజ్‌లు విపరీతంగా పాపులర్ అవుతున్నాయి. హాలీవుడ్ సెలెబ్రిటీలు, యూట్యూబర్లు, ప్రపంచవ్యాప్త పాపులర్ టిక్ టాకర్లు ఈ చాలెంజ్‌లో పాల్గొని ఆ వీడియోలను ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. అవి చూసిన భారతీయులు తాము టిక్ టాక్‌ను మిస్ అవుతున్నామని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story