- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టిక్‌టాక్‌కు లాయర్ల షాక్
ఇండో-చైనా బోర్డర్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు, 20 మంది భారత జవాన్ల మృతికి యావత్భారతం ప్రతికారం కోరుతోంది. చైనాకు తప్పనిసరిగా గుణపాఠం నేర్పాలని ఆర్మీతో పాటు, ప్రజలు కోరుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రభుత్వం చైనాకు మేడ్ టిక్‌టాక్ సహా 59 యాప్‌లపై నిషేధం విధించింది.అయితే, టిక్‌టాక్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తోంది. తమ తరఫున వాదించాలంటూ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గిని ఆ సంస్థ కోరింది. అయితే, ఆయన ఒప్పుకోలేదు. వారి అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు తెలిపి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా యాప్ తరఫున ఆ పని చేసేది లేదని స్పష్టం చేశారు. కోర్టును ఆశ్రయించి తమ పంతం నెగ్గించుకోవాలనుకున్న టిక్‌టాక్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలినట్లయింది.గతంలోనూ ఓ సారి టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించగా ఆ సంస్థ కోర్టుకెళ్లింది. తిరిగి భారత్‌లో పలు నిబంధనలతో ఆ యాప్‌కు అనుమతులు ఇచ్చారు. కానీ, ఈ సారి మాత్రం చైనా దుందుడుకు చర్యల వల్ల ఈ యాప్‌ను నిషేధించిన నేపథ్యంలో న్యాయవాదులు ఆ యాప్ తరఫున వాదించడానికి ముందుకు రావట్లేదు.