- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టైగర్ ష్రాఫ్ ‘అన్‌బిలీవబుల్’ అచీవ్‌మెంట్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సూపర్ హీరో టైగర్ ష్రాఫ్.. యాక్టింగ్, డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ఇప్పటికే చూసుంటారు. కానీ తను పాట పాడడం ఎప్పుడైనా చూశారా? లేదనుకుంటా! ఒకవేళ మీరు తన డైహార్ట్ ఫ్యాన్ అయితే, తను పాడటం కూడా చూడాలనుకుంటారు కదా. అఫ్‌కోర్స్ అభిమాన హీరో కాబట్టి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలాంటి ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్ చెప్పారు టైగర్ ష్రాఫ్. త్వరలో తన సింగింగ్ టాలెంట్‌ను కూడా పరిచయం చేయబోతున్నట్లు వెల్లడించాడు.
సోషల్ మీడియా వేదికగా తన ఫస్ట్ ట్రాక్ ‘అన్ బిలీవబుల్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు. వైట్ షర్ట్, బ్లాక్ టై, సన్ గ్లాసెస్‌తో మైక్ ముందు సూపర్ స్టైలిష్‌గా ఉన్న టైగర్ ష్రాఫ్.. తనకు తను పాడిన పాటపై డాన్స్ చేయాలని ఉంటుందని తెలిపాడు. కానీ ఆ కోరికను ముందుకు తీసుకెళ్లేందుకు ధైర్యం చేయలేకపోయానని చెప్పాడు. కానీ లాక్‌డౌన్‌లో చాలా సమయం ఇందుకోసం కేటాయించానని, దీనిపైనే వర్క్ చేశానని తెలిపిన టైగర్ ష్రాఫ్.. ఇదొక అన్ బిలీవబుల్ ఎక్స్‌పీరియన్స్ (నమ్మశక్యం కానీ అనుభవం) అని, అన్‌బిలీవబుల్ సాంగ్‌ను మీ ముందుకు తీసుకొచ్చేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని చెప్పాడు.
Read Also…