- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మల్లారం గుట్టల్లో పులి.. గజగజ వణుకుతున్న జనం
దిశ, భూపాల్ పల్లి: పులి బాబోయ్ పులి అంటూ భూపాల్ పల్లి జిల్లా వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా పెద్దపులి భూపాల్ పల్లి జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తుండడం, అది పశువుల కాపరులకు, బాటసారులకు కనిపించడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురు, శుక్ర, శని వారాల్లో పెద్దపులి ముఖ్యంగా భూపాల్ పల్లి జిల్లా అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తోంది. అటవీ శాఖ అధికారులు పులి అడుగుజాడలను గుర్తించి దానిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత సంవత్సరం కాలం నుండి ఈ ప్రాంతంలో పులి ఉందంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెద్దపులి మలహర్ మండలంలోని మల్లారం అడవుల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ మాసంలోనే ఈ ప్రాంతంలో పులి సంచరించింది. ప్రతిరోజూ ఏదో ఒక గ్రామ పొలిమేరలో పులి కనిపించడం, శాఖ అధికారులు పులి ఆనవాళ్లు సేకరించడం జరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో ఆహారం కోసం పులి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఈ అడవిలో జింకలు, కుందేళ్ళు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ జంతువులు పులికి సమీపంలో వచ్చే అవకాశాలు ఎక్కువ లేవని ఆవులపై దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉందంటూ అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పులి ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుండి వచ్చినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వేటగాళ్లు అడవి జంతువుల కోసం విద్యుత్ తీగలు అమర్చుతుంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వేటగాళ్ల వలన ఆ పులికి ప్రాణహాని ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటవీశాఖ అధికారులు మాత్రం పులికి ఎవరు హాని కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూనే ఉన్నారు. అడవిలోకి అడవి కాపరులు అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం ఎవరు వెళ్లరాదని.. ఆయా గ్రామాల్లో డప్పు చాటింపు ద్వారా గ్రామస్తులకు తెలియజేసినప్పటికీ, కొంతమంది అడవిలోకి వెళ్తునే ఉన్నారు. శనివారం భూపాల్ పల్లి డీఎఫ్ ఓ లావణ్య తోపాటు పులి జాడలు గుర్తించే నిపుణులు భూపాల్ పల్లి జిల్లాలోని కాటారం మహాముత్తారం మల్హర్ అటవీ ప్రాంతంలో పులి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పెద్దపులి భూపాల్ పల్లి అటవీ శాఖ పరిధిలోని మానేరు నది పరివాహక ప్రాంతంలో సంచరిస్తున్నదని.. శని, ఆదివారం అక్కడే ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పులికి గత 24 గంటలుగా ఆహారం దొరకలేదని.. ప్రస్తుతం అది ఆకలితో ఉందని.. ఎవరు కనబడినా ఏ జంతువు కనబడినా దాడి చేసే అవకాశాలుంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.