ఈ రాశి వారికి ఇంట్లో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం..

by Hamsa |   ( Updated:2021-09-08 11:54:02.0  )
ఈ రాశి వారికి ఇంట్లో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం..
X

తేది : 09 సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(ఈరోజు తెల్లవారు జాము 2 గం॥ 34 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 18 ని॥ వరకు)
నక్షత్రం : హస్త
(నిన్న సాయంత్రం 3 గం॥ 55 ని॥ నుంచి
ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 30 ని॥ వరకు)
యోగము : శుక్లము
కరణం : తైతిల
వర్జ్యం : (నిన్న రాత్రి 11 గం॥ 49 ని॥ నుంచి తెల్లవారు జాము 1 గం॥ 19 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 29 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఉదయం 8 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 21 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 10 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 58 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 54 ని॥ వరకు)

మేష రాశి : ఆర్థిక విషయాలలో పురోగతి ఉన్నతంగా ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలంటే ముందు మీ మానసిక స్థితిని సరి చేసుకోండి ఎందుకంటే మనసు మాత్రమే మంచిని చెడును సరైన విశ్లేషణ చేయగలుగుతుంది. సూర్య భగవానుని ప్రార్ధించండి. ధన, వస్తు, వాహనాలను జాగ్రత్తగా చూసుకోండి. చిన్ననాటి స్నేహితుల కలయిక మధురానుభూతిని కలిగిస్తుంది. ఈ రాశి స్త్రీలు ఆర్థిక ఇబ్బందులను దాటి వేయగలుగుతారు.

వృషభ రాశి : ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ ఉపయోగపడుతుంది. ఈ కరోనా సమయంలో కొత్త కాంట్రాక్టులు మీరు అనుకున్నంత లాభాలను తెచ్చి పెట్టలేవు. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు పర స్త్రీలు, మధువు మాంసము ల జోలికి వెళ్ళకండి. కుటుంబంలోని ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చే అవకాశం. ఈ రాశి స్త్రీలు సంతాన క్రమశిక్షణ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.

మిథున రాశి : ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఈ కరోనా సమయంలో మనోబలంతో పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలి దేనికీ తొందరపడవద్దు. యోగ మెడిటేషన్ చేయండి. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా మాట్లాడండి. జీవితభాగస్వామి నుండి మీకు విశేష ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఈ రాశి స్త్రీలు వ్యక్తిగతమైన వస్తువులను అతి జాగ్రత్తగా చూసుకోండి. పరుల చేతికి దొరికితే మీ రహస్యాలను సేకరిస్తారు.

కర్కాటక రాశి : ఎంతో కాలంగా తీసుకుందాం అనుకుంటున్న రుణం చేతికందే సమయం. స్థిరాస్తీ వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పిల్లల గొంతెమ్మ కోరికలు తీర్చ కూడదని నిర్ణయించుకుంటారు. వారి ప్రవర్తన మిమ్మల్ని బాధ పెడుతుంది. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి. ఈ రాశి స్త్రీలకు కుటుంబంలో అందరితో కలిసి ఉన్న మీరు ఒంటరి వారు అన్న భావన కలుగుతుంది.

సింహరాశి : లావు తగ్గుతామని ప్రయత్నాలు చేస్తున్న వారు అతి తిండిని తగ్గించండి. అభిమానించే వారి నుండి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి స్నేహితుల కలయిక ఆనందాన్నిస్తుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు పోవాలంటే సానుకూలంగా మాట్లాడుకోండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ ఆలోచనలలో స్పష్టత వస్తుంది.

కన్య రాశి : ఈ కరోనా సమయంలో వ్యాపారరీత్యా శ్రమ పెరుగుతుంది. నిరాశావాద ధోరణిని పక్కకు పెట్టండి. అది మీ ఆలోచనలనే కాక వ్యక్తులను కూడా మీకు దూరం చేస్తుంది. మీ మొండి వైఖరి వల్ల పిల్లలు బాధ పడే అవకాశం. మీకు వారికి మధ్య అంతరం పెరుగుతుంది అనే విషయం గుర్తించండి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టలేరు. వ్యాపారాల విస్తరణ లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. ఈ రాశి స్త్రీలకు స్పెక్యులేషన్ ద్వారా లాభం వస్తుంది.

ధనస్సు రాశి : ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. డబ్బు సంపాదన ఒకటే పరమావధి కాదు. దీనిని మరిచిపోతే బాంధవ్యాలు దెబ్బతింటాయి. సమస్యలను అధిగమించడానికి సరైన సలహాలు తీసుకోండి కానీ సరైన నిర్ణయం మీదే. కుటుంబంలోని పెద్దవారికి అనారోగ్య సూచనలు. జాగ్రత్త వహించండి. ప్రయాణాలను కుదిరితే వాయిదా వేసుకోండి. ఈ రాశి స్త్రీ లకు ఇతరుల మీద ఆధారపడి జీవించకొండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు.

తులారాశి : కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడతారు. అత్యాశ కొరకు కాకుండా నిజంగా వారి శ్రేయస్సు కొరకే అయితే దైవ సహాయం మీకు లభిస్తుంది. కుటుంబంలోని వ్యక్తుల అనారోగ్యం విచారానికి కారణమవుతుంది. అనవసర భయాందోళనలను వదిలి వారికి సరైన వైద్యం చేయించండి. ఎటువంటి ఇబ్బంది లేదు. మీ జీవిత భాగస్వామి అపార్థాలను దూరం చేయండి. జీవితం ఆనందమయం. ఈ రాశి స్త్రీలకు ఆర్థికంగా బాగుంది.

వృశ్చిక రాశి : ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి మరి కొంత సమయం వేచి ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ విషయాలలో మీ మొండి వైఖరిని విడనాడండి. ఆనందించే అంశాలు ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు ఒక మంచి పని జరుగుతుంది.

మకర రాశి : ఇంటిలో అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ తోడ పుట్టిన వారికి ఆర్థికంగా సహాయం చేస్తారు. మీరు అనాలోచితంగా అన్నమాట కుటుంబ సభ్యులను బాధిస్తుంది. వారిని సముదాయించడానికి ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ కుటుంబంలోని వ్యక్తులు మిమ్ములను సరిగా అర్థం చేసుకోవట్లేదు అని భావిస్తారు వారికి దూరంగా జరుగుతారు.

కుంభ రాశి : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ కరోనా సమయంలో యోగా మెడిటేషన్ తో మానసికంగా శారీరకంగా ఫిట్ గా ఉండండి. సామాజిక కార్యక్రమాలలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగి పోయేలా సంభాషించండి మీ జీవితం ఆనందమయం. ఈ రాశి స్త్రీలకు కార్యాలయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

మీన రాశి : ఆనందకరమైన రోజు. కార్యాలయంలో చిన్న జగడం జరిగే అవకాశం సహనం వహించండి. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి రుణబాధలు తీరుతాయి. దైవసహాయం తోడు ఉంది ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలచుకోండి. వ్యాపారంలో బంధువులతో, సన్నిహితులతో ఆర్ధికపరమైన విషయాలపట్ల జాగరూకతతో వ్యవహరించండి. ఈ రాశి స్త్రీలు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

Advertisement

Next Story