వైసీపీకి మరో బిగ్ షాక్.. రాజీనామా చేసిన మరో ఎమ్మెల్సీ

by Mahesh |
వైసీపీకి మరో బిగ్ షాక్.. రాజీనామా చేసిన మరో ఎమ్మెల్సీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (MLC Marri Rajasekhar) రాజీనామా (resignation) చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్కు పంపించారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో ఈయన కీలక నేతగా ఉన్నారు. రాజశేఖర్ పార్టీని వీడి వెళతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి మర్రి రాజశేఖర్ రాలేదు. దీంతో ఆయన రాజీనామా చేస్తారని వార్తలకు బలం చేకూరింది. వైసీపీ ఆవిర్భావం నుంచి రాజశేఖర్ ఆ పార్టీలో ఉన్నారు. 2014లో రాజశేఖర్ కు చిలకలూరిపేట టికెట్ ఇవ్వగా పత్తిపాటి పుల్లారావు పై ఓటమిపాలయ్యారు.

2019 ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వకుండా.. చిలకలూరిపేట టికెట్ ను విడుదల రజని కి కేటాయించారు. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే సమయం వచ్చినప్పుడు ఆ పదవిని కట్టబెట్టారు. విడుదల రజినికి ఈ మధ్యకాలంలో చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జి బాధ్యతలు అప్పచెప్పారు. తన సొంత నియోజకవర్గంలో మళ్లీ రజిని తీసుకురావడంపై రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాజశేఖర్ టీడీపీలో చేరతారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలతో కొంతకాలంగా ఆయన టచ్ లో ఉన్నట్లు సమాచారం.

Next Story

Most Viewed