- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇంట్లో సీసీ కెమెరా పెట్టి భార్యపై అనుమానం.. భరించలేక కన్నబిడ్డను హత్య చేసిన తల్లి

దిశ, వెబ్ డెస్క్: కట్టుకున్న భర్త అనుమానిస్తుండటం తట్టుకోలేక భార్య తన కన్న బిడ్డను హత్య చేసింది. ఈ దారుణమైన సంఘటన విశాఖపట్నం జిల్లాలోని పెదగదిలి కొండవాలు ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెదగదిలి కొండవాలు ప్రాంతానికి చెందిన గొర్రె వెంకటరమణ, శిరీష కి 2013లో వివాహం జరగ్గా.. ఐదు నెలల కిందట వీరికి ఒక పాప పుట్టింది. అయితే మొదటి నుంచి భార్యపై అనుమానం వ్యక్తం చేసే వెంకటరమణ పాప పుట్టిన తర్వాత తన అనుమానాన్ని మరింత పెంచుకొని నిత్యం మాటలతో వేధిస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఇంట్లో సీసీ కెమెరా పెట్టి మరి భార్యను గమనించేవాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష మార్చి 13న పడుకొని ఉన్న తన పాపను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా.. స్థానికంగా ఉన్న సముద్ర తీరానికి తీసుకెళ్లి.. పాప మృతదేహం తో పాటు నీటిలోకి వెళ్ళింది.
కొద్ది సేపు సముద్రపు నీటిలోనే ఉండి బయటకు వచ్చిన తర్వాత భర్తకు ఫోన్ చేసి.. సముద్రంలోని కెరటాలు ఎక్కువగా రావడంతో పాప నీటిలో మునిగిపోయామని.. కెరటాలు తగ్గిన తర్వాత బయటకు వచ్చి చూసే సరికి పాప కళ్లు తెరవడం లేదని భర్తకు చెప్పింది. అయితే మొదటి నుంచి భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పాప మృతదేహానికి పోస్టుమార్టం చేయగా ఊపిరాడక పోవడం వల్లే పాప చనిపోయినట్టు తేలింది. దీంతో పోలీసులు భర్త ఫిర్యాదు మేరకు శిరీషను అదుపులోకి తీసుకుని విచారించగా తనకు పాప పుట్టిన తర్వాత తనను అనుమానించడం తట్టుకోలేక.. పాపను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో శిరీషపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Read More..