గురువారం పంచాంగం, రాశిఫలాలు (06-05-2021)

by Hamsa |
Panchangam Rasi phalalu
X

తిథి దశమి 14:12:53
నక్షత్రము శతభిష 10:32:38
కరణం : విష్టి 14:12:53
బవ 26:49:55
పక్షం : కృష్ణ
యోగం : ఇంద్ర 19:20:02
రోజు : గురువారము
సూర్య మరియు చంద్ర లెక్కలు
సూర్యోదయం 05:47:59
చంద్రోదయము 27:07:00
జన్మరాశి : కుంభ
సూర్యాస్తమయం 18:37:43
చంద్రాస్తమయము 14:20:59
ఋతువు : గ్రీష్మ
హిందు మాసము మరియు సంవత్సరము
శక సంవత్ 1943 ప్లవ
కలి సంవత్ 5123
పగటి ప్రమాణము 12:49:43
విక్రమ సంవత్ 2078
అమావస్యాంత మాసము చైత్రం
పూర్ణిమాంత మాసము వైశాఖం
మంగళకర/అమంగళకర సమయం
మంగళకర సమయం
అభిజిత్ 11:47:12 – 12:38:31
అమంగళకర సమయం
దుర్ముముహూర్తములు :
10:04:34 – 10:55:53
15:12:28 – 16:03:47
కంటక/మృత్యు 15:12:28 – 16:03:47
యమఘంట 06:39:18 – 07:30:37
రాహు కాలము 13:49:04 – 15:25:17
కుళిక 10:04:34 – 10:55:53
కాలవేల 16:55:06 – 17:46:25
యమగండము 05:47:59 – 07:24:13
గుళిక కాలము 09:00:25 – 10:36:38
దిశ శూల
దిశ శూల దక్షిణం
చంద్ర బలం వాటి తార బలం

మేషరాశి : ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగస్తులకు మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేసేవారికి మంచి సమయము. డబ్బు లావాదేవీలలో లాభం కలిగే అవకాశం. ప్రయాణాలు ఎక్కువగా చేయవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకర్షణీయమైన స్కీమ్స్ లలో చేయడం వల్ల, చిట్టీలు కట్టడం వల్ల చిక్కులు ఎదురౌతాయి. జాగ్రత్త అవసరం.

వృషభ రాశి : అకారణంగా భయం, లేనిపోని చిక్కులు, ఊహలు వల్ల రోగ భయము, అనుమానం. వీటితో నేను వ్యయం అయ్యే అవకాశం. శత్రువులు అనుకున్న వృద్ధిని సాధించే అవకాశం ఉన్నా శత్రు వర్గంపై ఆధిపత్యం చెలాయించాలనే మీ చిరకాల‌వాంఛ నెరవేరుతుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది.

మిధున రాశి : పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధించవచ్చు. ప్రభుత్వం నుండి రావాల్సిన ధనం చేతికందుతుంది. , స్త్రీల మూలకంగా, వాహనాల వలన హాని జరగవచ్చు. ప్రభుత్వం నుండి ధనం వచ్చే అవకాశం. సౌఖ్యవంతమైన జీవితం. సంతానానికి ఇవ్వడం కోసం నూతన గృహం కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి : సోదరులు వలన సంతోషం పొందుతారు. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. విశేష ధనలాభం ఉన్నా దానికి తగ్గ ధనవ్యయం. సంతాన పురోగతికి కష్టపడతారు. భాగస్వామ్య వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచన.

సింహ రాశి : భార్య/భర్త మూలకంగా సౌఖ్యం, విశేష ధనలాభం మరియు సంతోషం. దూరప్రయాణాలకు అవకాశం. సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేయవలసి రావచ్చు. వివాహాది శుభకార్యాలలో చురుకుగా పాల్గొనవచ్చు.

కుంభ రాశి : ప్రభుత్వం పరమైనట్టి సంపద లభించుటకు అవకాశం ఉంది. మంచి భోజన ప్రాప్తి. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశంతో పాటు స్థానచలన అవకాశం కూడా ఉండవచ్చు. నేను నష్టం కలుగవచ్చు. వాహనం సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం కలుగుతాయి. ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేనిచో గౌరవానికి అవకాశం ఉన్నది. మాట నిలకడ, మంచితనం లేని వ్యక్తులకు సహాయం చేస్తే చిక్కులు వస్తాయి అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు.

కన్య రాశి : ధనలాభం మరియు ధాన్యం వృద్ధి. సోదరులు వలన సంతోషం, సంపదలకు అవకాశం. చదువులో ఆటంకాలు, ఆదాయానికి మించి ఖర్చులు సూచిస్తున్నాయి. రోజూవారీ ప్రయాణాల్లో నిర్లక్ష్యం తగదు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విష్ణుమూర్తిని ప్రార్థించడం ఉత్తమం.

తులారాశి : సర్వ సంపదలు లభిస్తాయి. ఎన్నాళ్ళ నుంచి పోరాటం చేసినా కొన్ని విషయాలలో ఫలితం దక్కదు. కానీ భూమిని కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఉదర సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం. మీరరు అభిమానించే వ్యక్తులు ఇబ్బందులలో పడడం వల్ల మానసిక వేదనకు గురి కావచ్చు. అనుకున్న విధంగా లాభాలు రాకపోయినా దూరం ప్రయాణాలు మరియు పై చదువులకు వెళ్ళాలనే మీ కోరికలు నెరవేరుతాయి.

వృశ్చిక రాశి : ధనలాభం ఉన్నది. అతిగా ఆలోచించడం వల్ల రోగభయం, మరియు దాని వలన అనవసరం ఖర్చు ఉంటుంది. వృత్తిలో శత్రువులపై విజయం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఆటుపోట్లు ఎదురైనా చివరికి విజయవంతమైన ఫలితాలే వస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

ధనూ రాశి: ధనలాభం. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని విశేషంగా ఖర్చు పెడతారు. విందు, వినోదాలు మరియు పిల్లల కొరకు చేసే పనులలో ఆటంకాలు. కోర్టు కేసులలో శత్రువులపై విజయం, అనుకూలమైన తీర్పులు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి.

మకర రాశి : ఏలినాటి శని వలన ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ప్రతి పనికీ అధికంగా శ్రమ పడవలసిన అవసరం బంధుమిత్రుల దర్శనం వల్ల ఆనందం. ఉద్యోగస్తులకు ధన వ్యయం వస్తుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలకు సాధారణ ఫలితాలు మాత్రమే లభిస్తాయి.

మీనరాశి : వృత్తి పరమైన విషయాలలో నష్టాలు కలుగవచ్చు. సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరుల వలన మరియు దగ్గర ప్రయాణాల వలన విశేష ధనలాభం. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ అవసరం అవుతుంది. పిల్లల కోసం ధనం వ్యయం చేయవలసి రావచ్చు. సాయిబాబాను దర్శించడం వలన సంతోషము మరియు వృత్తిలో ఆనందం లభిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed