- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేటెస్ట్ ‘థమ్స్ అప్’ యాడ్‌కు మహేశ్ వాయిస్..
దిశ, సినిమా : జీవితంలో ఎదురైన ప్రతీ సవాల్‌ను అధిగమించి, దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఇండియన్ ఒలింపియన్స్ కోసం సెలబ్రేటింగ్ యాడ్ తీసుకొచ్చింది ‘థమ్స్ అప్’. టోక్యో ఒలింపిక్ గేమ్స్‌కు పార్టనర్‌గా వ్యవహరిస్తున్న కంపెనీ.. ఈ యాడ్ ద్వారా నేషన్ హీరోస్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పడం పట్ల ప్రశంసలు అందుకుంటోంది. కాగా తెలుగు వెర్షన్ వీడియోకు థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ మహేశ్ బాబు వాయిస్ అందించగా.. అదిరిపోయిందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అభిమానులు.
‘ముందు మీ నాన్న నుంచి కాస్తయినా నేర్చుకో భజ్‌రంగ్! లేదా నీ దారైనా మార్చుకో’ అనే వాళ్ల మాటల్ని తలకిందులు చెయ్.. ‘తూటాలతో ఆటలా! నీ నాజూకు చేతులకు బందూక్ అవసరమా మనూ?’ అని తక్కువ చేసేవాళ్ల చూపుల్ని తలకిందులు చెయ్.. ‘వికాస్ ఇంకా ఎన్ని దెబ్బలు తింటావ్, నీ వల్ల కాదని ఇంకెప్పుడు తెలుసుకుంటావ్?’ అనే వాళ్ల సలహాల్ని తలకిందులు చెయ్.. ‘ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, మారు.. 11 మంది ఉన్న జట్టులో చేరు’ అనే వాళ్ల అభిప్రాయాల్ని తలకిందులు చెయ్.. ‘వీళ్లెక్కడ గెలుస్తారు, ఉత్తి చేతులతో తిరిగొస్తారు’ అనే వాళ్ల అంచనాల్ని తలకిందులు చెయ్.. ఎందుకంటే దేన్నయినా తలకిందులు చేసేవాళ్లే అసలైన ‘తుఫాన్’. అన్న మహేశ్ బాబు వాయిస్ గూస్‌బంప్స్ తెప్పిస్తోందని చెప్తున్నారు ఫ్యాన్స్. ‘జల్సా’ సినిమాకు ఎంత పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ ఇచ్చాడో, అంతకు మించిన ఎఫర్ట్స్‌తో వాయిస్ ఇచ్చిన మహేశ్.. టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాను రిప్రజెంట్ చేస్తున్న క్రీడాకారులను ఈ విధంగా ప్రోత్సహించడం ఆనందంగా ఉందంటున్నారు.
- Tags
- mahesh babu