- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోశయ్య మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తుమ్మల
X
దిశ, పాలేరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణ వార్త తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన దిశతో మాట్లాడుతూ.. రోశయ్య మరణం చాలా బాధాకరమన్నారు. రోశయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేశారన్నారు. మంచి వక్తగా పేరుతెచ్చుకున్న ఆయన ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు సాధించారన్నారు. వరుసగా 7సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనని కొనియాడారు. మంచి వ్యక్తిని కోల్పోయామని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
Advertisement
Next Story