ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి

by Sumithra |   ( Updated:2021-04-23 21:52:46.0  )
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా సత్తెన పల్లి మండలం నందిగామ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం కొంత మందిన కూలీలు ఆటోలో కూలి పనికోసం వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటోను కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజు, ఆలివేలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన పై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్టుగా తెలిపారు.

Advertisement

Next Story