కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

by Shamantha N |
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు. దక్షిణ కశ్మీర్ జిల్లా షోపియాలోని రేబాన్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ ఏరియాలో బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ బద్దలైనట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని వివరించారు. అయితే, వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో ఇంకా గుర్తించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్టు ఆదివారం మధ్యాహ్నాం ఆ అధికారి తెలిపారు.

Advertisement

Next Story