ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలు.. రెండు కళ్లు చాలట్లేదంటున్న ఫ్యాన్స్

by Anjali |   ( Updated:2023-10-19 13:09:02.0  )
ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలు.. రెండు కళ్లు చాలట్లేదంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: స్టార్ నటీమణులు కీర్తిసురేశ్‌, ఐశ్వర్యలక్ష్మీ, కల్యాణి ప్రియదర్శన్‌లు ఒకే ప్రేమ్‌లో దర్శనమిచ్చి తమ అభిమానులను అట్రాక్ట్ చేశారు. ఈ మేరకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ నటించిన ‘లియో’ సినిమా గురువారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా చెన్నైలోని వెట్రి థియేటర్‌లో ఫస్ట్‌ డే ఫస్ట్ షోకు వెళ్లినట్లు చెప్పిన ఈ ముగ్గురు సినిమా హాల్‌లో తెగ సందడి చేశారు. అంతేకాదు తమ సీట్లలో కూర్చొని దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మురిసిపోయిన కీర్తిసురేష్.. ‘FanGirls Our @KeerthyOfficial with @kalyanipriyan and Aishwarya mam’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా ఒకే ప్రేమ్‌లో ఇన్ని అందాలు చూడటానికి కళ్లు సరిపోవట్లేదంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story