అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి

by Sumithra |   ( Updated:2020-02-24 20:01:17.0  )
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కోలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు మృతిచెందారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున(అమెరికా సమయం ప్రకారం.. ఆదివారం సాయంత్రం) ఈ దుర్ఘటన ఎఫ్ఎం 423 ఇంటర్‌సెక్షన్ వద్ద చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఉత్తర టెక్సాస్ వైపు వెళ్తున్న ట్రక్కు.. సౌత్‌లో ఉన్న డెల్ వెబ్ బొలీవర్డ్‌కు వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. కారు డ్రైవర్ దివ్య ఆవుల (34), ఆమె భర్త రాజా గావిని(41), మరొకరు ప్రేమ్‌నాథ్ రామనాథం(42)లు ఘటనాస్థలం వద్దే మ‌రణించారు. ట్రక్కు డ్రైవర్ మైనర్ కావడంతో అతనిపేరు వెల్లడికాలేదు.

Advertisement

Next Story