స్పేస్‌లోకి ముగ్గురు చైనా ఆస్ట్రోనాట్స్

by Harish |
Chinese astronauts
X

దిశ, వెబ్‌డెస్క్ : మొదటిసారి చైనా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా.. గురువారం ఉదయం షెంన్‌జూ12 క్యాప్సూల్‌లో ఆస్ట్రోనాట్స్ వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాముల్లో నీ హైషెంగ్‌, లయూ బోమింగ్‌, టాంగ్ హోంగ్‌బోలు ఉన్నారు. వీరంతా భూమికి 380 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న తియాన్‌హీ మాడ్యూల్‌లో మూడు నెలలు గడపనున్నారు. కాగా, చైనా.. గోబి ఎడారిలో ఉన్న జిక్వాన్ శాటిలైట్ లాంచింగ్ కేంద్రం నుంచి రాకెట్‌ను ప్రయోగించింది.

అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనాట్ల గురించి చైనా చివరి నిమిషం వరకు గోప్యంగానే ఉంచింది. చివరి 24 గంటల ముందు ముగ్గురు వ్యోమగాముల వివరాలను ప్రకటించింది. ఆస్ట్రోనాట్లలో ఒకరైన 56 ఏళ్ల నీ హైషెంగ్‌.. సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన గతంలో రెండసార్లు రోదసిలోకి వెళ్లి వచ్చాడు. 2013లో ప్రోటోటైప్ స్పేస్ స్టేషన్‌లో 15 రోజులు గడిపారు. ఇక మిగితా ఇద్దరు వ్యోమగాములకు ఎయిర్‌ఫోర్స్ అనుభవం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed