భూపాలపల్లిలో ముగ్గురు అరెస్ట్.. భారీగా స్వాధీనం

by Shyam |

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి పోలీసులు నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టు రట్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ నుంచి భూపాలపల్లి వైపు వస్తున్న ఓ కారులో నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు సీసీఎస్, టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గణపురం మండలం చెల్పూర్ టి జంక్షన్ వద్ద కారును పోలీసులు సోదా చేయగా రెండు గోనె సంచుల్లో సుమారు 70 కిలోల లూజు పత్తివిత్తనాలు లభ్యమయ్యాయి. అవి నకిలీ పత్తి విత్తనాలు అని వ్యవసాయ అధికారి ధృవీకరించడంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story