సంచలన ఆరోపణ: ‘ఆ మంత్రులు గంజాయి, గుట్కా, డ్రగ్స్ తీసుకుంటారు’

by Anukaran |   ( Updated:2021-07-24 04:15:31.0  )
bandi-sanjay 1
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ మంత్రులపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పదవి నుండి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన తరువాత ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా హుజురాబాద్‌పై పట్టు సాధించేందుకు పార్టీల నాయకులు ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

ఈ రోజు ఉదయం హుజురాబాద్‌లో పర్యటిస్తున్న బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రులు గంజాయి, గుట్కా, డ్రగ్స్ తీసుకుంటారని.. వారు ఈటలకు పోటీ కాలేరన్నారు. అంతేకాకుండా ఈటల గెలిచాక నేరుగా అయోధ్యకు వెళతామని వెల్లడించారు. హుజురాబాద్‌లో ఈటల పాదయాత్ర చేస్తే ప్రగతి భవన్‌లో కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదన్నారు. రానున్న కాలంలో అధికారంలో వచ్చేది బీజేపీనేనని, అప్పుడు హైదరాబాద్‌లో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed