పానీపూరీ కథ.. సృష్టికర్త ‘ద్రౌపది’?

by Shyam |   ( Updated:2021-05-20 04:17:59.0  )
పానీపూరీ కథ.. సృష్టికర్త ‘ద్రౌపది’?
X

దిశ, ఫీచర్స్ : పిల్లలు, టీనేజ్ అమ్మాయిలకు పానీపూరీ ఫేవరెట్ ఫుడ్ అన్న విషయం తెలిసిందే. కానీ లాక్‌డౌన్ టైమ్‌లో పానీ పూరీ లవర్స్ ఆ టేస్ట్‌కు దూరం కావాల్సి వస్తోంది. అయితే ఎలాగైనా తినాలని అనుకునేవారు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడంపై దృష్టిపెడుతున్నారు. కాగా దేశవ్యాప్తంగా ఒక్కో చోట ఒక్కో పేరు(గోల్‌గప్పా, పుచ్కా, పానీపూరీ)తో ఫేమస్ అయిన ఈ స్ట్రీట్ ఫుడ్‌కు ఆద్యులు ఎవరనే విషయం తెలుసుకునేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వెబ్‌సైట్ ‘కోరా’లో.. పానీపూరీ, గోల్‌గప్పా ఎలా పుట్టుకొచ్చాయన్న విషయంపై పానీపూరీ రకాల కంటే ఎక్కువ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని మీ కోసం..

ద్రౌపది..

మహాభారతంలో ద్రౌపది మొట్టమొదట పానీపూరీని తయారు చేసిందనేది ఒక వాదన. దీని ప్రకారం.. వనవాస సమయంలో పాండవుల తల్లి కుంతీ దేవి, కోడలు ద్రౌపదిని పరీక్షించేందుకు మిగిలిపోయిన బంగాళాదుంప కూర, కొద్దిపాటి పిండితో ఐదుగురు అన్నదమ్ములకు వంట చేయమని అడిగిందట. ఐదుగురిలో తనకు ఎవరంటే ఇష్టమో కనుక్కోవడం దీని వెనకున్న ఉద్దేశం కాగా, ఈ మేరకు ద్రౌపది పానీపూరీ తయారుచేసిందట. దీంతో తన క్రియేటివిటీకి ఫిదా అయిన కుంతీదేవి.. ఈ డిష్‌కు అమరత్వాన్ని ప్రసాదించిందనేది ఒక వివరణ.

ది కింగ్‌డమ్ ఆఫ్ మగధ..

‘గోల్‌గప్పా’ ఫుడ్.. మొదట మగధ రాజ్యంలో పుట్టిందనేది మరొక పాపులర్ థియరీ. అక్కడి ఫుల్కీ(మధ్యప్రదేశ్‌లో ఇదే పేరుతో పిలుస్తారు) మనం తినే పానీపూరీ కంటే సైజులో చిన్నగా ఉండి, పొటాటోలతో నింపబడి ఉంటుంది.

లక్నోకు చెందిన నవాబ్ కోసం డాక్టర్ల సృష్టి..

లక్నోకు చెందిన నవాబ్ వాజిద్‌ కడుపు నొప్పికి ఔషధంగా గోల్‌గప్పా లేదా పానీ పూరీ ఉనికిలోకి వచ్చిందనేది మరో కథ. నవాబ్ తన కడుపు నొప్పికి మందులు తీసుకునేందుకు నిరాకరించడంతో.. నీటిలో పలు రకాల సుగంధ ద్రవ్యాలను కలిపి గోల్‌గప్పా రూపంలో ఔషధాలుగా అందించారు. కాగా కడుపునొప్పిని నివారించే మందుగా మొదలైన పానీపూరీ ప్రస్థానం.. కడుపునొప్పికి కారణమయ్యే వరకు చేరడం పట్ల ‘వాట్ ఏ జర్నీ’ అంటూ కామెంట్లు వినిపిస్తుండటం విశేషం.

ఇలా పానీపూరీ పుట్టుకపై కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మహాభారతాన్ని ఇప్పటికీ ఒక పౌరాణిక కథగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఇక ‘ఫుల్కీ’ వంటకం మగధ రాజ్యంలో పుట్టిందనుకున్నా.. భారతదేశానికి బంగాళాదుంపలు 17వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యం అంతమైన తర్వాతే ప్రవేశించాయి. ఈ లెక్కన ఇవేవీ సరైన వాదనలుగా నిరూపించబడలేదు. ఇలా ఎవరికి వారు ఒక్కో కథను ప్రచారం చేస్తుండగా.. ఎవరు కనిపెడితే ఏంటి? వారికి కృతజ్ఞతలు చెబితే సరి.. అనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed