- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సింగిల్ చార్జ్ తో 100 కి.మీ మైలేజ్.. వారికోసమే ప్రత్యేక బైక్
దిశ, ఫీచర్స్ : ‘ఎలక్ట్రిక్ వెహికల్స్’(ఈ-వీ) శకం రాబోతుందని కొత్తగా చెప్పనక్కర్లేదు. టూ వీలర్స్ టు ఫోర్ వీలర్స్ కంపెనీలన్నీ సరికొత్త డిజైన్లతో ఈ-వెహికల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు భారత్ పరుగులుతీస్తున్న ప్రస్తుత తరుణంలో దివ్యాంగులు, వృద్ధులకు కంఫర్ట్‌గా ఉండే ఈ తరహా వాహనాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేసింది ఢిల్లీకి చెందిన ‘EV వెంచర్ కోమకి’. ఇటీవలే XGT X5 ఈ-స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయగా ఇది మెరుగైన భద్రతా ఫీచర్లతో పాటు మెకానికల్ పార్కింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. స్మార్ట్ త్రీ-వీలర్‌గా వస్తున్న ఈ బైక్ ప్రమాదాలను కూడా నిరోధిస్తుంది.
కోమకి అందిస్తున్న ఈ స్పెషల్ ఈ-బైక్ రెండు వెర్షన్లలో అందుబాటులో ఉండగా, సింగిల్ చార్జింగ్‌తో 100 కిమీ లోపు వెళ్లొచ్చని కంపెనీ చెబుతోంది. పూర్తిగా చార్జ్ చేయడానికి నాలుగు గంటలు పడుతుండగా ఇది గరిష్టంగా 25 కిమీ వేగంతో నడుస్తుంది. లిథియం-అయాన్ బ్యాటరీలపై రెండు సంవత్సరాల వారంటీ అందిస్తుండగా వీటి ధర 75 వేల నుంచి 91 వేల వరకు ఉన్నాయి. ఒకవేళ బైక్‌కు ఏదైనా రిపేర్ అయితే రిపేర్ మోడ్ యాక్టివేట్ చేసి గంటకు 20 కి.మీ వేగంతో ప్రయాణీకులు ఇంటికి లేదా కంపెనీ వర్క్‌షాప్‌కి చేరుకోవచ్చని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపాడు.
అంతేకాదు ఈ స్కూటర్ ‘సెల్ఫ్ రిపేర్ ఫంక్షన్’ ఫెసిలిటీ కలిగి ఉండగా.. బ్రేకింగ్ పనితీరును పరిష్కరించడంతో పాటు దానికదే సమస్యను గుర్తించి సాల్వ్ చేస్తుంది. దీనివల్ల రైడర్లు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇక దివ్యాంగులకు, వృద్ధులకు అనుకూలంగా ఉండేలా ‘మెకానికల్ పార్కింగ్ ఫీచర్’ అందించారు. ఇందుకోసం బ్రేక్ లివర్‌కు కనెక్ట్ చేసిన ఓ స్విచ్‌ను హ్యాండిల్ బార్‌లో అమర్చారు. దీన్ని నొక్కితే బైక్ వెనక్కి, ముందుకి కదలకుండా అలానే ఉండిపోతుంది. అదే విధంగా ఈ-స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్, రివర్స్, పార్క్ మోడ్స్ కూడా ఉన్నాయి. డిజిటల్ డాష్‌లో చార్జింగ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.