- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశ్వాసం అంటే నీదే: చావుకు ఎదురెళ్లి పిల్లల ప్రాణాల్ని కాపాడుతున్న కుక్క
దిశ,వెబ్‌డెస్క్: కుక్కలు విశ్వాసానికి ప్రతీక. పిడికెడు తిండి పెడితే ప్రాణాలకు తెగించి యజమానులను కాపాడతాయి. అందుకే వాటిని చాలా మంది ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. యజమానులను అవి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేవు. అలాంటి ఓ కుక్క గత కొన్నేళ్లుగా చిన్నారుల ప్రాణాలకు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి అడ్డుగా నిలుస్తోంది.
తూర్పు ఐరోపా మరియు పశ్చిమ ఆసియా దేశాల మధ్యలో జార్జియా అనే దేశం ఉంది. జార్జియా దేశానికి చెందిన బటుమి అనే నగరంలో కుపాటా అనే జాగిలం పేరు చెబితే అక్కడి ప్రజలు హర్షధ్వానాలతో అభినందనలు తెలుపుతారు. ఆ నగరంలోని ఓ ప్రాంతంలో కుపాటా చిన్న పిల్లల ప్రాణాల్ని కాపాడేందుకు విధులు నిర్వహిస్తుంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ సిగ్నల్ వద్ద పిల్లలు స్కూళ్లకు వెళ్లే సమయంలో, లేదంటే వచ్చే సమయంలో, రోడ్ క్రాస్ చేయాలన్నా కుపాటా సాయంతో రోడ్డు దాటుతుంటారు. పిల్లలు రోడ్ క్రాస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే స్పీడుగా వస్తున్న వాహనాలకు ఎదురెళ్లి వాటిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఒక్కోసారి ఎవరైనా వెహికల్ ఆపలేదంటే అరుస్తూ వెంటపడుతుంది. 5ఏళ్ల క్రితం చిన్న కుక్కపిల్లగా వచ్చిన కుపాటా ఆ ప్రాంతంలో తిరుగుతుంటే స్థానికులే అక్కున చేర్చుకున్నారు. టైమ్ కు తిండి పెట్టి దాని బాగోగులు చూసుకునే వారు. కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు అదే పిల్ల కాస్త పెద్దదైంది. ఆ నగర వాసులకు పెద్ద దిక్కైంది. రెండేళ్ల క్రితం బటుమి నగర రోడ్ల మీద తిరిగే కుపాటా ఒక్కసారిగా ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తింది. ఇదిగో మీరు వీడియోలో చూస్తున్నట్లుగా సిగ్నల్స్ వద్ద విధులు నిర్వహిస్తు పిల్లల ప్రాణాల్ని కాపాడుతుంది.
ఈ సందర్భంగా కుపాటా స్నేహితులైన నోనా అనే మహిళ మాట్లాడుతూ.., కుపాటా చిన్నకుక్క పిల్లగా ఈ ప్రాంతానికి వచ్చింది. ఎలా వచ్చిందో తెలియదు. స్థానికులే దాని బాగోగులు చూసుకున్నారు. కానీ రెండేళ్లుగా ఇదిగో మీకు కనిపిస్తున్న సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి … సాయంత్రానికి తనకు ఏర్పాటు చేసిన ఇంటికి వస్తుంది అంటూ నోనా సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు కుపాటా లేకపోతే తల్లిదండ్రులు అల్లాడిపోయేవారు. స్కూల్ కు వెళ్లే సమయంలో సిగ్నల్స్ దాటాలంటే కష్టంగా ఉండేది. గతంలో ఈ సిగ్నల్స్ దాటుతుండగా చిన్నారుల ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు. నేను(నోనా) మా చిన్నమ్మాయి, బేకా ముగ్గురం దాని బాగోగులు చూసుకుంటున్నామని తెలిపారు.
అంతేకాదు కుపాటా గొప్పతనం గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. జాగిలం పేరుతో సోషల్ మీడియా అకౌంట్లను మెయింటైన్ చేస్తున్నారు. ఇటీవల అడ్జారా టూరిజం సంస్థ సభ్యులు కుపాటా గొప్పతనం తెలుసుకొని ‘పీపుల్స్ ఛాయిస్’ పేరుతో కుపాటా ను పెద్ద పెయింటింగ్ రూపంలో పదిలంగా ఉంచారు.