గ్రీన్ సిటీలో గ్రీన్ చిల్లీ చాయ్

by Sujitha Rachapalli |   ( Updated:2021-02-17 04:36:03.0  )
గ్రీన్ సిటీలో గ్రీన్ చిల్లీ చాయ్
X

దిశ, ఫీచర్స్: చిటికెలో మన మూడ్ మార్చే డ్రింక్ ‘చాయ్’. ఇందులోనూ బోలెడు ఫ్లేవర్లు, కాంబినేషన్లు. అయినా ప్రతీ రుచి దేనికదే భిన్నం. అందుకే ‘చాయ్’లో కొత్త ఫ్లేవర్ వచ్చిందంటే, చాయ్ ప్రేమికులు ‘టేస్ట్’ చేయకుండా ఉండలేరు. ఒక్కసారి ఆ రుచికి ఫిదా అయ్యారంటే.. ఇక ఆ కేఫ్‌కు క్యూ కట్టాల్సిందే. ఈ క్రమంలోనే టీ లవర్స్‌కు.. బెంగళూరులోని చాయ్‌ఫీ కేఫ్ యూనిక్ ‘చిల్లీ చాయ్’ రుచిని అందిస్తోంది. గ్రీన్ చిల్లీతో రూపొందించే ఈ స్పైసీ, స్వీట్, హాట్ చాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు గ్రీన్ సిటీలో హాట్ న్యూస్‌‌గా మారింది. ఈ ఒక్క‘టీ’ అనే కాదు, చాయ్‌ఫీ కేఫ్ మరెన్నో యూనిక్ ఫ్లేవర్స్‌ను అందిస్తుండటం విశేషం.

సాధారణ టీ ఎలా తయారు చేస్తారో, దీన్ని కూడా అలానే చేస్తారు. కానీ, అదనంగా తాజా పచ్చిమిర్చిని యాడ్ చేయడమే ఈ టీ ప్రత్యేకత. స్పైసీ టీ ఇష్టపడేవారికి ఇది పర్‌ఫెక్ట్ టీ అని, జలుబు, గొంతు నొప్పితో బాధపడేవారికి ఈ చాయ్ చక్కని ఉపశమనాన్ని ఇస్తుందని మేకర్స్ అంటున్నారు. కాగా చిల్లీ చాయ్‌కు ఊహించని స్పందన రావడంతో సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చ నడుస్తోంది. దాంతో ఒక్కసారైనా చిల్లీ చాయ్ తాగాలని బెంగళూరు వాసులతో పాటు నెటిజన్లు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కస్టమర్లకు భిన్న రుచులను అందించడానికి ఈ కేఫ్ ప్రయోగాలు చేస్తోంది. సూథింగ్ మొర్రోకాన్ మింట్, కాశ్మీరీ కహ్వా, ఓరియంటల్ అల్లం నుంచి దేశీ మసాలా చాయ్ వరకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన భిన్న రకాల చాయ్ రుచులను అక్కడ ఆస్వాదించవచ్చు. అలాగే మిల్క్‌షేక్‌లను ఇష్టపడేవారి కోసం లోటస్ బిస్కెట్, స్నికర్స్, మార్స్, ఫెర్రెరో రోచర్‌తో తయారు చేసిన మిల్క్‌షేక్‌లను అందిస్తూ అందులోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది.

Advertisement

Next Story

Most Viewed