- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తరగతి గది గోడలకు ఆవుపేడను పూసిన ప్రిన్సిపాల్.. వైరల్ వీడియోపై ప్రిన్సిపాల్ క్లారిటీ

దిశ, వెబ్ డెస్క్: తరగతి గది గోడలకు ఓ ప్రిన్సిపాల్ ఆవుపేడను పూసిన ఘటన ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్ (Viral) గా మారింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కళాశాల (Lakshmibai College) ప్రిన్సిపాల్ సిబ్బంది సహాయంతో క్లాస్ రూం గోడలకు ఆవుపేడను పూస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ ప్రత్యూష్ వస్తల (Principal Prathyush Vatshala) మాట్లాడుతూ.. తాను చేసిన ఆ పని ఓ అధ్యాపకుడి పరిశోధనలో భాగమని, ఈ ప్రాజెక్టు పేరు సాంప్రదాయ భారతీయ పద్దతులను ఉపయోగించి వేడి నియంత్రణ అధ్యయనం అని చెప్పుకొచ్చారు.
ఈ పరిశోధన (Research) పోర్టా క్యాబిన్ (Porta Cabin) లో నిర్వహించబడుతోందని, ఒక వారం తర్వాత ఈ పరిశోధనకు సంబంధించిన మొత్తం వివరాలను వెల్లడిస్తానని అన్నారు. అంతేగాక సహజ బంకమట్టిని తాకడం వల్ల ఎటువంటి హాని ఉండదు కాబట్టి ఒక గదికి తానే పూయడం జరిగిందని తెలిపారు. అంతతేగాక పూర్తి వివరాలు తెలియక కొందరు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని, తానే స్వయంగా అధ్యాపకుల బృందానికి సంబంధించిన గ్రూప్ లో వీడియోను షేర్ చేసినట్లు తెలిపారు. కళాశాలలోని సీ బ్లాక్ లోని తరగతి గదులను చల్లగా ఉంచేందుకు దేశీయ పద్దతిని అవలంబిస్తున్నామని, త్వరలోనే ఈ గదులన్ని కొత్త రూపాన్ని సంతరించుకుంటాయని ప్రిన్సిపల్ వివరించారు.