- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?
by Jakkula Mamatha |

X
దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం(Srisailam)లోని ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల(Devotees) రద్దీ పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు శ్రీశైలానికి బారులు తీరారు. అలాగే సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లు, దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. అయితే.. స్వామి అమ్మవారి అర్జిత సేవలు, అభిషేకాలు కుంకుమార్చనలు నిలుపుదల చేసినట్లు సమాచారం.
Next Story