పొట్టకూటి కోసం వలస వచ్చి విగతజీవిగా మిగిలాడు

by Sumithra |
పొట్టకూటి కోసం వలస వచ్చి విగతజీవిగా మిగిలాడు
X

దిశ, మేడ్చల్ టౌన్ : ప్రమాద వశాత్తు క్రషర్ మిషన్లో పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో ఉన్న రోబో సిలికాన్ క్రషర్ మిషన్లో మధ్యప్రదేశ్ కి చెందిన మనిషి సింగ్ (27) ప్లాంట్ ఆపరేటర్ గా పనిచేస్తూ ఉండేవాడు. సోమవారం తెల్లవారు జామున మనీష్ సింగ్ ప్రమాదవశాత్తు క్రషర్ మిషన్లో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed