దవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

by srinivas |
దవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: గోదావరి నదికి వరద పోటెత్తింది. రాజమండ్రి వద్ద వరద సంద్రంలా కనిపిస్తోంది. దీంతో దవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 17.75 అడుగులకు చేరింది. దీంతో 175 గేట్లు పూర్తిగా ఎత్తి.. 19 లక్షలు క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక పోలవరం కాఫర్ డ్యాం వద్ద భారీగా వరద నీరు చేరింది. దవళేశ్వరం బ్యారేజీ వద్ద గంట గంటకు వరద ప్రవాహాం పెరుగుతోంది. దీంతో లంక గ్రామాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల పంట తీవ్ర నష్టం వాటిల్లింది.

Advertisement

Next Story