స్వర్ణ కారులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం.. చార్మినార్ సాక్షిగా సంచలనం రేపిన ఘటన

by Anukaran |   ( Updated:2021-07-26 08:27:36.0  )
స్వర్ణ కారులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం.. చార్మినార్ సాక్షిగా సంచలనం రేపిన ఘటన
X

దిశ, చార్మినార్ : బంగారంలో హాల్ మార్క్ 91.6 నగలు చేయాలని బెంగాలీ స్వర్ణకారులకు ఆర్డర్ ఇచ్చాడు ఓ జ్యూవెల్లరీ షాపు యజమాని .. సంవత్సరంన్నర నుంచి బంగారం పనులు ఇస్తున్నా నాణ్యతలో మార్పులేదు. ఇప్పటివరకు కేజీ బంగారం నొక్కేశారనే ఆరోపణతో జ్యూవెల్లరీ షాప్ యజమాని తన ఐదుగురు అనుచరులతో కలిసి ముగ్గురు బెంగాలీ స్వర్ణ కారులను నిర్బంధించి విచక్షణారహితంగా దాడులు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒళ్ళంతా హూనం చేశారు. పైగా వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు జ్యూవెల్లరీ షాపు యజమాని అనుచరగణం. వారి చిత్రహింసలు భరించలేక బాధితులు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే… చేలాపురాకు చెందిన ప్రతీఫ్ జైన్ జ్యూవెల్లరీ దుకాణం యజమాని.

ప్రతీఫ్ బంగారు నగల ఆర్డర్లు తీసుకుని గత సంవత్సరంన్నర నుంచి బెంగాలీకి చెందిన బుబాయి షాతా, లక్ష్మీ కాంత్, సిలాన్ మాన్హా అనే స్వర్ణకారులకు పనులు ఇచ్చేవాడు. హాల్ మార్క్ 91.6 కింద పనులు చేయాలని సూచించాడు. చివరగా ఇచ్చిన పనులలో నాణ్యత లోపించిందని ప్రతీఫ్ జైన్ అనుమనించాడు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకుండా ప్రతీఫ్ జైన్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రతీఫ్ తన ఐదుగురు అనుచరులతో కలిసి చేలాపురాలోని బెంగాలీ స్వర్ణ కారుల ఇంటికి వెళ్లి తమ ప్రతాపం చూపెట్టారు. బుబాయి షాతా, లక్ష్మీ కాంత్, సిలాన్ మాన్హా లపై చెక్కలతో శరీరం కందిపోయేలా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఇద్దరు స్వర్ణ కారుల చేతులను గ్యాస్ సిలిండర్ కు తాళ్లతో కట్టి దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన బెంగాలీ స్వర్ణ కారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed