దోపిడీ దొంగల బీభత్సం.. ఎక్కడంటే

by Shyam |   ( Updated:2021-03-04 21:59:48.0  )
దోపిడీ దొంగల బీభత్సం.. ఎక్కడంటే
X

దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌మేట్‌లో అర్థరాత్రి దుండగులు దొంగతనానికి తెగబడ్డారు. అర్థరాత్రి ఓ ఇంట్లోకి చొరబడే ముందు పక్కన ఉన్న ఇంటికి గడియ బెట్టి దొంగతనానికి ప్రయత్నించారు. కాగా ఆ ఇంటిలో ఏమీ దొరకపోవడంతో ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న ఆటోలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed