ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాలి…

by Anukaran |   ( Updated:2021-08-01 21:51:35.0  )
helath tips
X

దిశ, వెబ్‌డెస్క్: ఆహారం, ఆరోగ్యం పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని చెప్పుకోవచ్చు. అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని ఆహారాలు ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు. అయితే మారే కాలంతో పాటు మన ఆహార అలవాట్లలో కూడా చాలా మార్పు వచ్చింది. కిచిడి, పొంగలి, దద్దోజనం లాంటివి పూర్వపు వంటలుగా మారిపోయాయి. వాటి స్థానంలో జంక్ ఫుడ్స్ వచ్చి చేరాయి. ఫలితంగా మన శరీరం కావాల్సినంత శక్తిని పొందలేక అనారోగ్యాల బారినపడుతోందని చెపొచ్చు. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. కారణం మన ఆహారపు అలవాట్లే అంటూ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. మరి మంచి ఆహరపు అలవాట్లు ఏంటో చూద్దాం..

Should I absolutely replace white rice with roti? - Quora

ఆరోగ్యానికి మిశ్రమ ఆహారం మంచిది. మనం రోజు వరి అన్నం తినడానికి అలవాటు పడిపోయాం. అలాగే ఉత్తరాది వారు నిత్యం గోధుమ పిండితో చేసిన రొట్టెలను ఎక్కువగా తీసుకుంటుంటారు. మనం రోజు ఒకరకమైన ధన్యానికే పరిమితం కావడం వల్ల నష్టంలేదు కానీ.. ఆశించినన్ని పోషకాలు మాత్రం లభించవు. ఎందుకంటే.. వరి అన్నంలో ఉండే మాంస కృతులు సంపూర్ణమైనవి కావు. వీటిలో లైసిన్ అనే అమైనో ఆమ్లాం కొంత తక్కువ మోతాదులో ఉంటుంది. అయితే ఇది పప్పు ధాన్యాల్లో అధికంగా లభిస్తుంది. కాబట్టి బియ్యంలో రోజు పప్పు ధాన్యాలను కలిపి వండుకు తింటే, బియ్యంలో లోపించిన అమైనో ఆమ్లాలు పప్పు ధాన్యాల ద్వారా భర్తీ అవుతాయి. అలాగే పప్పు ధాన్యాలలో కొన్ని అమైనో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. అవి బియ్యం ద్వార అందుతాయి. ఇలా బియ్యం, మరో పప్పు ధాన్యంతో మిశ్రమంగా తినడం వల్ల ఆహారంలోని మాంస కృతులు సంపూర్ణమవుతాయి.

What Is Grain Free Pet Food, Really? | PetMD

మనకు పప్పు ధాన్యాలకు కొదువలేదు. శనగ, కంది, పెసర, మినుము, అలసందలు, బొబ్బర్లు, ఉలవలు వంటి ఎన్నో రకాల పప్పు ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతిపూట అన్నంతో పాటు ఓ పప్పు ధాన్యాన్ని వంటల్లో చేర్చుకుంటే మంచిది. కేవలం ఒకేరకమైన పప్పు ధాన్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని రకాల ధాన్యాలను వాడుతుండాలి అంటున్నారు నిపుణులు.

Food Grain Facts - 30 Interesting Facts About Food Grains | KickassFacts.com

Advertisement

Next Story

Most Viewed