- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి రావాలన్నా, ఏపీ నుంచి వెళ్లాలన్నా ఈ రూల్స్ పాటించాలి
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు చిక్కుకున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు చెందిన వ్యవసాయ కూలీలు వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనోపాధి వెతుక్కుంటున్నారు. ఆకస్మిక లాక్‌డౌన్ నేపథ్యంలో వారంతా ఆయా చోట్ల చిక్కుకుపోయారు.
తొలి దశ లాక్‌డౌన్ నేపథ్యంలో జీవనోపాధి కరవై వారంతా పూటగడవడానికి కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆకలి బాధలు తాళలేక చెన్నై నుంచి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నడుచుకుంటూ వచ్చి ఊరి పొలిమేరల్లో యువకుడు మరణించిన ఘటన కలచివేస్తే.. కరోనా శవమేమోనని ఆ శవాన్ని ముట్టుకునేందుకు కూడా ఎవరూ దరిజేరకపోవడం మరింత భాధాకరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సడలింపుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తీసుకెళ్లేందుకు ఏపీ నడుం బిగించింది.
ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ చేరాలనుకుంటున్న వారికి లేదా ఏపీలో చిక్కుకుని ఆయా రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న వారు స్వస్థలాలకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే, అధికారులకు పలు కీలక సూచనలు చేసింది.
వాటి వివరాల్లోకి వెళ్తే…
1) రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న కార్మికులు 1902 ఫోన్ నంబరుకు కాల్ చేయాలి.
2) వలస కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
3) గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్లకు మాత్రమే రాకపోకలకు అనుమతి.
4) శిబిరాల నుంచి స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలి.
5) పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారిని బస్సుల్లో తరలించాలి
6) ఆ బస్సుల్లో కూడా ఆక్యుపెన్సీ 50 శాతానికి మించకుండా తరలించాలి.
7) స్వగ్రామానికి చేరుకున్న అనంతరం కూలీలు అక్కడ మరోసారి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి.
8 ) అనంతరం మరో 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి.
9) ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ బృందం మొత్తాన్ని అక్కడే ఉంచాలి.
10) పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
11) ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి గురించి అధికారులు ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలి, ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాలి.
Tags: migrant workers, quarantine rules, travel rules, ap, health department