బీ అలర్ట్: వచ్చే వారం మరో తుఫాన్

by Shamantha N |
బీ అలర్ట్: వచ్చే వారం మరో తుఫాన్
X

న్యూఢిల్లీ: తౌక్టే తుఫాన్ విలయం మరవకముందే మరో తుఫాన్ వచ్చే వారం కమ్ముకొచ్చే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈ తుఫాన్ తూర్పు భారతంపై ప్రభావం వేయొచ్చునని వివరించింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, అది బలోపేతమై తుఫాన్‌గా మారే ముప్పు ఉందని ఐఎండీ అధికారులు బుధవారం వెల్లడించారు. మే 22న తుఫాన్‌గా పరిణమించి 26న ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాల్లోకి ప్రవేశిస్తుందని అంచనా వేశారు. యాస్ అని నామకరణం చేసిన ఈ తుఫాన్ వస్తే బెంగాల్‌లో ఈ ఏడాది రెండో తుఫాన్‌గా నిలవనుంది. మే 25నే ఒడిశా, బెంగాల్‌తోపాటు మేఘాలయా, అసోంలలోనూ వర్షాలు కురిసే అవకాశముంది. మే 21 తర్వాత సముద్రంలో వేటకు వెళ్లవద్దని జాలర్లకు ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లినవారు మే 23 కల్లా వెనుదిరగాలని అధికారులు హెచ్చరించారు.

Advertisement
Next Story

Most Viewed