అప్పుడు కేబీసీలో కోటి… ఇప్పుడు ఎస్పీ

by Shamantha N |
అప్పుడు కేబీసీలో కోటి… ఇప్పుడు ఎస్పీ
X

పాపులర్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 2001లో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా కేబీసీ జూనియర్ పేరుతో వచ్చిన సంగతి గుర్తుంది కదా… అందులో పాల్గొన్న 14 ఏళ్ల రవి మోహన్ సైనీ వరుసగా 15 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రూ. కోటి గెల్చుకున్నది కూడా కొందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు 34 ఏళ్ల వయసున్న రవి మంగళవారం రోజున పోర్‌బందర్ ఎస్పీగా చార్జ్ తీసుకున్నాడు.

పాఠశాల చదువు పూర్తయ్యాక జైపూర్‌లోని మహాత్మగాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన రవి, అదయ్యాక 2014లో యూపీఎస్సీ క్లియర్ చేసి, ఇండియన్ పోలీస్ సర్వీసుకి ఎంపికయ్యాడు. అతను ఆలిండియాలో 461వ ర్యాంకు సాధించాడు. తండ్రి నేవీ ఉద్యోగి కావడంతో తనకు పోలీస్ అవ్వాలని కోరిక ఉండేదని, అందుకే ఐపీఎస్‌లో చేరినట్లు రవి తెలిపాడు. అంతేకాకుండా తాను ఛార్జ్ తీసుకున్నపుడే కొవిడ్ 19 ప్రభావంతో ఇబ్బంది పడుతున్నవారికి అండగా నిలుస్తుండటం ఆనందాన్ని ఇస్తుందని ఆయన సంతోషపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed