- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బతుకు ప్రయాణంలో ‘రంగు’ పాత్ర.. వారి జీవితానికి శాపమేనా ?
దిశ, సినిమా : అంటరానితనం, అణగారిన వర్గాలు, అల్ప సంఖ్యాకులు, నల్లజాతీయులు, నీగ్రోలు.. పేరేదైనా అనుభవించే పెయిన్ మాత్రం ఒక్కటే. ఈ విభజన ఒక దేశంలో ‘కులం’ ఆధారంగా జరిగితే.. మరో చోట ‘మతం’ అందుకు కారణం కావచ్చు. ఇవి రెండూ కాకుంటే రంగు, రూపమైనా తెరపైకి రావొచ్చు. రూరల్ ఇండియాలోని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ శూద్ర కులాలపై అనధికార అణిచివేత కొనసాగుతూనే ఉండగా.. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో ‘కలర్ డిస్క్రిమినేషన్, కల్చర్ డిఫరెన్సెస్’ గురించి తెలియంది కాదు.
ఈ క్రమంలో ఆయా దేశాల్లో జాతివివక్షకు బలైపోయిన, పోతున్న నల్ల జాతీయులకు లెక్కే లేదు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వివక్షత ఎదుర్కొంటూ సొంత దేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్న బ్లాక్ పీపుల్‌కు అస్థిత్వ పోరాటం అనేది తమ లైఫ్ జర్నీలో ఒక భాగమైపోయింది. చట్టాలు, న్యాయవ్యవస్థలు అండగా నిలిచినా సరే.. సాటి మనుషుల్లో సహోదర భావం లేనంత వరకు సమానత్వం కల్లే. కాగా తెల్లజాతీయుల మస్తిష్కాల్లో పాతుకుపోయిన ఈ జాత్యహంకార భావనలు.. ఒక ఆఫ్రో అమెరికన్ ఫ్యామిలీని ఏ విధంగా ట్రీట్ చేశాయి? నీగ్రోలు తమతో ఈక్వల్ లైఫ్ అనుభవించడం పట్ల వైట్ పీపుల్ ఎలా ఫీలయ్యారు? ఈ సమస్యకు ఆజ్యం పోయడంలో బ్లాక్ పీపుల్ గత నేపథ్యాలు ఎలాంటి పాత్ర పోషించాయో చూపించిన అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ ‘దెమ్’.
1916 నుంచి 1970 మధ్య దాదాపు 60 లక్షల ఆఫ్రికన్ అమెరికన్లు.. యునైటెడ్ స్టేట్స్ దక్షిణ భాగంలోని రూరల్ ఏరియాస్ నుంచి నార్త్ ఈస్ట్, మిడ్ వెస్ట్, వెస్ట్ ప్రాంతాలకు వలస వెళ్లారు. ‘గ్రేట్ మైగ్రేషన్’గా పిలువబడే ఈ ఫేజ్‌లో ఇండస్ట్రియల్ జాబ్స్ ఆఫర్‌తో చాలామంది దక్షిణాది నుంచి కాలిఫోర్నియాకు షిఫ్ట్ అవగా.. ‘మిస్టర్ ఎన్రీ ఎమొరీ’ అనే నల్లజాతీయుడు కూడా తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి నార్త్ కరోలినా నుంచి లాస్ ఏంజెల్స్‌కు మారుతాడు. రెండో ప్రపంచ యుద్ధంలో అనేక బాధలు అనుభవించిన తనకు ఇంజినీర్‌గా జాబ్ రాగా, తన పిల్లలకు బ్రైట్ ఫ్యూచర్ అందించాలనేది అతడి తపన. ఈ మేరకు క్రాంప్టన్‌లో తెల్లవాళ్లు నివాసముండే ఖరీదైన కమ్యూనిటీలో ఇల్లు కొనుగోలు చేస్తాడు. కానీ అక్కడి వైట్ కమ్యూనిటీ.. తమ మధ్యన ఒక బ్లాక్ ఫ్యామిలీ ఉండటాన్ని తట్టుకోలేరు. అంతా ఒక్కటై వారిని వెళ్లగొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి తోడు ఆ ఇంట్లో వెంటాడే దుష్ట శక్తులు, పనిచేసే చోట అవమానాలు అసహనానికి గురిచేస్తుంటాయి. ఇన్ని ప్రతికూలతల నడుమ ఆ ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అయ్యింది? తమ సమస్యల నుంచి ఎలా బయపడింది? అనేది మిగతా కథ..
స్టోరీ ఎనాలిసిస్..
వెండెల్ అనే వైట్ ఉమన్ నాయకత్వంలో ఎమొరీ ఫ్యామిలీని తమ కమ్యూనిటీ నుంచి పంపించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. మరోవైపు ఆ ఇంట్లోని వ్యక్తులు ప్రవర్తించే తీరు అనేక అనుమానాలకు తావిస్తుంటుంది. లాస్ ఏంజెల్స్‌కు మారడానికి ముందు ఎమొరీ వైఫ్ లక్కీ.. చంటి పిల్లాడితో ఇంట్లో ఒంటరిగా ఉండగా తెల్లవాళ్లు ఇంటిపై దాడిచేస్తారు. తనపై అత్యాచారం చేసి, పిల్లాడిని చంపేస్తారు. ఆ ట్రాన్స్ నుంచి కోలుకోని లక్కీ.. అప్పుడప్పుడు అబ్‌నార్మల్‌గా ప్రవర్తిస్తుంటుంది. తల్లి ప్రవర్తనతో విసిగిపోయిన పెద్ద కూతురు రూబీ.. తన రంగు, రూపుపై అయిష్టత ప్రదర్శిస్తూ కొత్త రూపం కోసం ఆరాటపడుతుంటుంది. మరోవైపు చిన్న కూతురు గ్రేసీ.. ‘మిస్ వెరా’ అనే పుస్తకంలోని టీచర్ క్యారెక్టర్‌ను రియల్‌గా ఊహించుకుంటూ వింతగా అరుస్తుంటుంది.
ఇదిలా ఉంటే పెట్ డాగ్ హత్యతో పాటు ఇంటి ముందు బొమ్మలు ఉరితీయడం వంటివి చేస్తూ ఎమొరీ ఫ్యామిలీని అనేక రకాలుగా బెదిరింపులకు గురిచేస్తుంటారు. ఇందుకు మరో వ్యక్తి సాయం కోసం వెళ్లిన వెండెల్.. అతని కోరిక తీర్చకపోవడంతో తన చేతిలోనే హత్యకు గురవుతుంది. అయితే ఎమొరీనే తనను కిడ్నాప్ చేసుంటాడని ఆగ్రహం చెందిన వైట్ కమ్యూనిటీ.. అతడి ఫ్యామిలీపై దాడికి దిగుతుంది. ఇదే క్రమంలో వారు కమ్యూనిటీని విడిచి వెళ్లాలనుకోగా.. అప్పుడే లక్కీ తన పెట్టెలో ఎప్పటి నుంచో దాచుకున్న కొడుకు శవం బయటపడుతుంది. దీంతో తన మానసిక స్థితి సరిగాలేదని రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపిస్తారు. ఇక కూతురు రూబీ సాయంతో ప్రమాదం నుంచి బయటపడ్డ ఎమొరీ, వారిపై తిరిగి దాడి చేసి హెచ్చరిస్తాడు. చివరకు ఫ్యామిలీలోని అందరూ తమ ట్రాన్స్ నుంచి బయపడటంతో పాటు ఇంట్లోని దుష్ట శక్తులకూ సమాధానం దొరకడంతో ఎండ్ అవుతుంది.