కడప ఏటీఎంలో చోరీ.. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి మరీ

by srinivas |
atm theft
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ కలకలం రేపింది. కడపలోని కేఎస్‌ఆర్‌ఎమ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ దగ్గర్లోని ఎస్‌బీఐ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు గ్యాస్‌ కట్టర్‌ సాయంతో ఏటీఎంలోని రూ.17 లక్షల నగదును అపహరించారు. ఈ విషయాన్ని కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి మీడియాకు తెలియజేశారు.

మంగళవారం ఉదయం ఏటీఎంలో నగదు చోరీకి గురైందని గుర్తించిన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పుకొచ్చారు. ఏటీఎంను పరిశీలించి క్లూస్‌ టీమ్‌తో పరిసర ప్రాంతాల్లో ఆధారాలు సేకరించామని తెలిపారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ వెంకట శివారెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ చోరీలో ఐదుగురు వ్యక్తుల ప్రమేయం ఉందని నిర్ధారించారు. ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఏటీఎం మిషన్‌ను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి సొమ్ము అపహరించినట్లు డీఎస్పీ వెంకట శివారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed