రూ.2లక్షల చైన్ వదిలేసి.. రూ.2వేలు దొంగిలించాడు

by  |
రూ.2లక్షల చైన్ వదిలేసి.. రూ.2వేలు దొంగిలించాడు
X

దిశ, వెబ్ డెస్క్: దొంగలు రకరకాలుగా ఉంటారు. కొందరు వస్తువులు, బంగారం, క్యాష్ ఇలా ఎంచుకుని మరి దొంతతనానికి పాల్పడుతారు. వీరందరిలో కామన్ పాయింట్ ఎంటంటే.. ఎక్కువ వాల్యూ ఉన్న వాటినే దొంగిలించడం. కానీ ఓ దొంగ ఎక్కువ వాల్యూ ఉన్న బంగారం వదిలి కేవలం 2వేలు మాత్రమే అపహరించాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని మామిళ్లగూడెం ఉంటున్న రిటైర్డ్‌ ఉద్యోగి బాబ్జీ ఇంట్లో జరిగింది.

రాత్రి వేళ అందరూ పడుకున్న సమయంలో విండోకు ఉన్న జాలి కట్ చేసిన దొంగ.. కర్ర సాయంతో గోడకు తగిలించి ఉన్న ఓ బ్యాగ్‌ను కొట్టేశాడు. అందులో రూ.2లక్షల విలువ చేసే బంగారపు పుస్తెలతాడు ఉండగా.. దానిని వదిలేసి కేవలం రూ.2వేలు మాత్రమే తీసుకున్నాడు. అనంతరం తన దారిన తాను వెళ్లకుండా ఆ బ్యాగును కుండీలో వేసినట్లు గొడమీద రాసి మరి వెళ్లాడు.

ఏమని అంటే ‘నాకు డబ్బులు అత్యవసరం.. అందుకే బ్యాగులో నుంచి రూ.2 వేలు తీసుకున్నా.. మీ బంగారం బ్యాగులోనే ఉంది, దానిని కుండీలో వదిలేసా.. నన్ను క్షమించండి’ అని రాసి వెళ్లిపోయాడు. తెల్లవారాక కుటుంబ సభ్యులు లేచి కిటికీ వైపు చూడగ.. జాలీ కత్తిరించి ఉంది. అనుమానం వచ్చి ఇంట్లో వెతకగా గోడకున్న బ్యాగ్ కనిపించలేదు.

బయట అంతా పరీక్షించగా కిటికీ పక్కన గోడపై ఆ దొంగ రాసిన రాతలు కనిపించాయి. దీంతో బాధితులు మొక్కలున్న కుండీ దగ్గర చూడగా బ్యాగ్ కనిపించింది. ఓపెన్ చేసి చూడగా అందులో పుస్తెల తాడు భద్రంగానే ఉంది. దీంతో వారు ఊపిరిపీల్చుకోవడమే కాకుండా, జరిగిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు.


Next Story

Most Viewed