- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షాకింగ్ న్యూస్.. 15 నిమిషాలు ఆలస్యంగా సినిమా వేసినందుకు రూ.లక్ష జరిమానా
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కాచిగూడలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 15 నిమిషాలు ఆలస్యంగా సినిమా వేసినందుకు థియేటర్‌కు అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. ఆశ్చర్యానికి గురి చేసే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తార్నాకకు చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి 2019 జూన్ 22న ‘గేమ్ ఓవర్’ సినిమా చూసేందుకు కాచిగూడ క్రాస్ రోడ్స్ లోని ఐనాక్స్ థియేటర్‌కు వెళ్లాడు. సినిమా 4.30 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉండగా… 4.45 నిమిషాలకు ప్రారంభించారు. దీంతో విసుగు చెందిన విజయ్ గోపాల్.. టికెట్‌పై ప్రచురించిన సమయానికి సినిమా వేయకుండా ప్రకటనలు వేసి తన సమయాన్ని వృథా చేశారని ఆరోపిస్తూ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. తన సమయాన్ని వృథా చేసినందుకు ఐనాక్స్ లీజర్ ప్రైవేట్ లిమిటెడ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
థియేటర్ మేనేజర్‌కి ఫిర్యాదు చేసినా దీనిపై పట్టించుకోలేదని ఫిర్యాదులో తెలిపాడు. మొదటి ప్రతివాదిగా థియేటర్ యాజమాన్యం, రెండో ప్రతివాదిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను చేర్చాడు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల కోర్టు.. తాజాగా తుది తీర్పును వెల్లడించింది. రూ.లక్ష జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిని హైదరాబాద్ పోలీస్ కమిషన్‌కి పెనాల్టీ కింద చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఫిర్యాదు చేసిన వ్యక్తికి పరిహారంగా రూ.5 వేలు, కేసు ఖర్చల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని ఐనాక్స్ యాజమాన్యానికి సూచించింది.