మద్యం మత్తులో అన్నను హత్య చేసిన తమ్ముడు

by Sumithra |
Bharath
X

దిశ, కుత్బుల్లాపూర్ : మద్యం మత్తులో అన్నను తమ్ముడు హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… దుండిగల్ మున్సిపాలిటీ గాగిల్లపూర్‌లోని ఓ ఇంటి చెందిన భరత్(35), సాయితేజ అన్నదమ్ములు. గత కొంతకాలంగా ఇద్దరు మద్యం సేవిస్తూ గొడవ పడుతుండేవారు. సాయితేజ జులాయిగా తిరుగడంతోనే సమస్య తీవ్రమైంది. ఎప్పటి మాదిరిగానే ఈనెల 24న అర్ధరాత్రి అన్నదమ్ములు గోడవపడ్డారు. మద్యం మత్తులో ఉన్న సాయితేజ అన్న భరత్ భుజాలు, కాళ్లు, మోకాళ్లు, ఛాతిపై విచక్షణా రహితంగా దాడి చేసి పడుకో పెట్టి పరారయ్యాడు.

25వ తేదీన భరత్ నిద్ర లేవలేదు. పక్ష వాతంతో పక్కన్నే మరో గదిలో ఉంటున్న తల్లికి భరత్ రోజు మందులు ఇస్తుంటాడు. అయితే నిన్న మొత్తం కొడుకు రాకపోవడంతో ఆమె ఇంటి యజమానిని వాకాబు చేసింది. దీంతో యజమాని మారుతి రావు వెళ్లి భరత్‌ను గమనించగా అతడు విగత జీవిగా పడి ఉన్నాడు. భరత్ మృతి చెందాడని అతడి స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed