వెంబడించి కత్తులతో దాడి… యువకుడు మృతి

by Sumithra |
వెంబడించి కత్తులతో దాడి… యువకుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పట్టపగలే ఓ యువకుడిపై కొందరు గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా దాడి చేశారు. ఆయుధాలతో తీవ్రంగా గాయపరిచి హత్య చేశారు. ఈ ఘటన తమిళనాడులో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే… గోకుల్‌(28) అనే యువకుడు బుధవారం రాణిపేట్‌లోని ఆరక్కణం కొత్త బస్టాండుకు వెళ్లాడు.

అతన్ని హతమార్చడానికి కుట్ర పన్నిన వ్యక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా నలుగురు వ్యక్తులు అతడిపై దాడికి దిగారు. దీంతో భయంతో పరుగులు తీస్తున్న గోకుల్‌ను వెంబడించి మరీ హతమార్చారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న గోకుల్‌ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గోకుల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story