స్విగ్గీలో ఐస్‌క్రీమ్ ఆర్డర్.. తిన్న కాసేపటికే యువకుడు..

by Sumithra |
స్విగ్గీలో ఐస్‌క్రీమ్ ఆర్డర్.. తిన్న కాసేపటికే యువకుడు..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని నాచారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐస్‌క్రీమ్ తిన్న కొద్దిసేపటికే యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం.. నాచారానికి చెందిన సంపత్ అనే యువకుడు ఈరోజు ఉదయం స్విగ్గీలో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఐస్‌క్రీమ్ తిన్న కొద్దిసేపటికే సంపత్‌.. వాంతులు, విరోచనాలు చేసుకుంటూ మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంపత్ మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story