- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచానికి ఆర్థిక మాంద్యం తప్పదు
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యం బారినపడేస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది సుమారు 5.8 లక్షల కోట్ల నుంచి 8.8 లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు 440.8 లక్షల కోట్ల రూపాయల నుంచి 668.8 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టపోయే అవకాశముందని ఏడీబీ చెబుతోంది.
ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 6.4 నుంచి 9.7 శాతానికి సమానం కావడం విశేషం. ఇక దక్షిణాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు కంపించిపోతాయని ఏడీబీ అభిప్రాయపడింది. ఈ ఏడాది దక్షిణాసియా దేశాల జీడీపీ 3.9 శాతం నుంచి 6 శాతం వరకు అంటే సుమారు 14,200 కోట్ల డాలర్ల నుంచి 21,800 కోట్ల డాలర్లు భారత కరెన్సీలో ఇంచుమించు 10.79 లక్షల కోట్ల రూపాయల నుంచి 16.56 లక్షల కోట్ల రూపాయలు పడిపోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
దీంతో కోట్ల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పింది. ఒకవేళ ఉద్యోగాలు ఉన్నప్పటికీ జీతాల్లో కోత పడుతుందని, కొత్త ఉద్యోగాల్లో వేతనాలు తగ్గిపోతాయని అభిప్రాయపడింది. ఈ తగ్గుదల 1.2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 1.8 లక్షల కోట్ల డాలర్ల వరకు ఉండొచ్చని ఏడీబీ పేర్కొంది. ఆసియా దేశాల్లో కార్మికుల వేతనాలు 30 శాతం వరకు తగ్గిపోయే ప్రమాదముందని హెచ్చరించింది.