సంజయ్‌కు షాక్.. నిలదీసిన మహిళలు

by Shyam |
సంజయ్‌కు షాక్.. నిలదీసిన మహిళలు
X

దిశ, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేను స్థానిక మహిళలు నిలదీసారు. వివరాల ప్రకారం.. జిల్లాలో ఓ కార్యక్రమంలో సంజయ్ మాట్లాడుతూ.. ఐకేపీ సెంటర్ ఉన్న స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. ఆ సందర్భంలో సత్తవ్వ అనే మహిళ ఆ స్థలంలో ఇళ్లు కట్టవద్దని కన్నీరు పెట్టుకుంది.

దీంతో సమావేశంలో ఉన్న మిగతా మహిళలంతా సత్తవ్వకు మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే.. ఆ స్థలంలో ఇళ్ల కట్టడాలు చేపట్టబోమని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed