ప్రియున్ని పట్టించా.. రివార్డు ఇవ్వండి

by vinod kumar |   ( Updated:2021-11-21 22:52:14.0  )
ప్రియున్ని పట్టించా.. రివార్డు ఇవ్వండి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమించిన వ్యక్తి తప్పు చేశాడని తెలిసి పోలీసులకు పట్టించింది ఓ యువతి. దాంతో ప్రభుత్వం ప్రకటించిన మొత్తం అందించాలని ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. అమెరికా నాష్ విల్లే డౌన్ టౌన్ లో గత ఏడాది క్రిస్మస్ పండగలో భారీ పేలుళ్లు జరిగాయి. అప్పట్లో నేరస్తుడిని పట్టుకోవడానికి పోలీసులు తెగ ప్రయత్నాలు చేసి చివరాకరికి కొంత మొత్తం డబ్బు ప్రకటించారు. దాంతో పేలుడు కు కారణమైన ఆంథోని వార్నర్ ను తన ప్రేయసి పమేలా పెర్రీ పట్టించింది.

తనకు ఇంతవరకూ పోలీసులు ఇస్తామన్న డబ్బు ఇవ్వలేదని డేవిడ్ సన్ కౌంటీ ఛాన్సరీ కోర్టులో పిటీషన్ కూడా వేసింది. దర్యాప్తు సంస్థలకు సహకరించినందుకు తనకు 2,84,000 డాలర్ల రివార్డ్ ఇవ్వాలని పిటీషన్ లో కోరింది. నిందితున్ని పట్టించిన వారికి ప్రభుత్వమే కాదు కొన్ని సంస్థలు కూడా రివార్డులు ప్రకటించాయి. క్యాంపింగ్ వరల్డ్ సీఈఓ 2,50,000 డాలర్లు, నాష్ విల్లే కన్వెన్షన్, విజిటర్స్ కార్సొరేషన్ 34,500 డాలర్లు ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఆ సంస్థలు మాట మార్చాయి. నిజంగా పమేలా పెర్రీ నే పట్టించింది అనడానికి ఆధారాలు లేవని, నిందితున్ని కూడా సజీవంగా పట్టుకోలేదు కదా అంటూ ప్లేటు ఫిరాయించేస్తున్నాయి.

epaper – MORNING EDITION (22-11-21) చదవండి

Advertisement

Next Story