అమానుషం: మహిళను చెప్పుతో కొట్టిన సర్పంచ్

by Sumithra |   ( Updated:2021-08-02 05:16:29.0  )
woman insulted
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం జెండాలుతండాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. భూ వివాదంలో ఓ మహిళను, మహిళా గ్రామ సర్పంచ్ చెప్పుతో కొట్టి అవమానపరిచింది. అనంతరం ఇరువురు పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఫిర్యాదు అందగానే పోలీసులు గ్రామంలోకి ప్రవేశించి, పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story