మూడో పెళ్లికి సిద్ధమైన భర్త.. మర్మాంగాన్ని కోసేసిన భార్య

by Sumithra |
husband Penis
X

దిశ, వెబ్‌డెస్క్ : అతడికి అప్పటికే రెండు పెళ్లిలు అయ్యాయి. ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అయినా వారిద్దరు సరిపోరు అన్నట్లు మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆ పెళ్లి కూడా తన పెద్ద కుమార్తెతోనే చేయాలని పట్టుబట్టాడు. దీంతో విసిగివేసారిన రెండో భార్య.. భర్త మర్మాంగాన్ని కోసి హత్య చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది.

భౌరా కాలన్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి జితేంద్ర సింగ్ తెవాటియా వివరాల ప్రకారం.. ముజఫర్ నగర్ జిల్లా భౌరా ఖుర్ద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక మసీదులో మత గురువుగా చేస్తున్నాడు. అతడికి ఇద్దరు భార్యలు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే ఇటీవల అతడి మనసు మూడో పెళ్లి వైపు మళ్లింది. దీంతో రెండో భార్యను రోజు చిత్రహింసలకు గురి చేసేవాడు. మూడో పెళ్లి చేసుకుంటానని, సహకరించాలని గొడవకు దిగేవాడు. పెళ్లి కూడా తన పెద్ద కుమార్తెతోనే చేయాలని పట్టుబట్టాడు.

భర్తకు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో భార్యకు కోపం వచ్చింది. అతడు బతికి ఉంటే తన కుమార్తెలకు ప్రమాదమని భావించింది. ఈ క్రమంలోనే అతడు నిద్రపోతున్న సమయంలో భర్త మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావమైన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే హత్యను మొదట అనుమానస్పద మృతిగా భావించిన పోలీసులు.. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడంతో హత్యగా తేలింది. హతుడి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండడం.. మర్మాంగం కట్ చేసి ఉండడంతో పోలీసులు భార్యను అనుమానించారు. ఆమెను అదుపులోకి తీసుకోని విచారించగా.. మర్డర్ తానే చేసినట్లు ఒప్పుకుంది. హత్యకు దారి తీసిన ఘటనలను పోలీసులకు వివరించింది.

Advertisement

Next Story