హైదరాబాద్‌లో సంచలనం.. భర్త ఉన్నా ప్రియుడి మీద మోజుతో ఆమె ఏం చేసిందంటే..

by Sumithra |   ( Updated:2021-09-28 23:38:33.0  )
హైదరాబాద్‌లో సంచలనం.. భర్త ఉన్నా ప్రియుడి మీద మోజుతో ఆమె ఏం చేసిందంటే..
X

దిశ, వెబ్‌డెస్క్ : భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోవడానికి ఏ భార్య ఇష్టపడదు. కానీ, ప్రియుడి మోజులో పడి భర్తను కిడ్నాప్ చేయించి మరీ విడాకుల పేపర్లపై సంతకాలు చేయించుకుంది ఓ భార్య. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్‌లోని మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్ వాజిద్(31), 2012‌లో అప్సియా బేగం(24) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే అప్సియాకు సోషల్ మీడియాలో ఓ అబ్బాయి ఆసిఫ్‌ పరిచయం అయ్యాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరి ప్రేమ ముదిరింది. దీంతో వీరు పెళ్లి చేసుకుందాము అని ఫిక్స్ అయ్యారు. దీంతో అప్సియా అతనితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ, భర్త పోలీసుల సహాయం‌తో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాడు.

అయితే ప్రియుడి మీద ఉన్న ఇష్టంతో భర్త మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది అప్సియాకు. దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలిగించుకోవాలని ఫిక్స్ అయ్యింది. అందుకోసం ప్రియుడితో కలసి పథకం వేసింది. ఎలా అయినా భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. దాంతో భర్తను విడాకులు ఇవ్వాల్సిందే అని పట్టుపట్టింది. కానీ భర్త విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో ప్రియుడు అతని ముగ్గురు స్నేహితులతో కలసి భర్తను కిడ్నాప్ చేయించి, విడాకుల పత్రాల మీద సతకం చేయించుకుంది. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు అందడం తో ప్రియుడిని అప్సియా బేగం ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఆసిఫ్‌కు ఇప్పటికే రెండు సార్లు వివాహం జరిగినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అతడికి పిల్లలు కూడా ఉన్నారని సమాచారం.

బిగ్ బ్రేకింగ్.. యువతికి మద్యం తాగించి నలుగురు వ్యక్తులు ఆసుపత్రి గదిలో..

Advertisement

Next Story